Brahmanandam: అలా టార్గెట్ చేయడం సరికాదంటున్న బ్రహ్మానందం!

తెలుగులోని ప్రముఖ కమెడియన్లలో బ్రహ్మానందం ఒకరనే సంగతి తెలిసిందే. బ్రహ్మానందం తన సినీ కెరీర్ లో 1200కు పైగా సినిమాలలో నటించారు. గత కొన్నేళ్లలో బ్రహ్మానందంకు సినిమా ఆఫర్లు తగ్గాయి. అయితే జాతిరత్నాలు సక్సెస్ తర్వాత బ్రహ్మానందంకు సినిమా ఆఫర్లు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అలీతో సరదాగా షోలో నవ్వుల పాలవడం సాధారణ విషయమని తాను కూడా నవ్వుల పాలయ్యానని బ్రహ్మానందం తెలిపారు. ఇది చేశానని చెప్పుకోవడం తనకు నచ్చదని బ్రహ్మానందం వెల్లడించారు. ప్రస్తుతం ఐదారు సినిమాలలో చేస్తున్నానని బ్రహ్మానందం పేర్కొన్నారు.

కామెడీ, వేదాంతం వేర్వేరు కాదని ఒకటే అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. తాను పడ్డంత శ్రమ ఎవరూ పడలేదని బ్రహ్మానందం పేర్కొన్నారు. అప్పట్లో తాను రోజుకు 18 గంటలు పని చేశానని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టే తాను సినిమాలు చేస్తున్నానని బ్రహ్మానందం వెల్లడించారు. సమయం, పని అందరికీ దొరకవని ఒక వయస్సు వచ్చాక మనం మనకోసం కష్టపడకూడదని బ్రహ్మానందం పేర్కొన్నారు. అలీ కామెడీ కూడా తనకు ఇష్టమని అయితే అలీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడతాడని మహిళలను కించపరుస్తాడని వచ్చిన కామెంట్లు తనను బాధపెట్టాయని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.

కమెడియన్లను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం సరికాదని బ్రహ్మానందం అన్నారు. కమెడియన్ల ఏడుపంతా ప్రేక్షకులను నవ్వించడానికేనని బ్రహ్మానందం కామెంట్లు చేశారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు ఒకరిని తిట్టమని చెప్పగా వీడో పెద్ద జప్ఫాగాడిలా ఉన్నాడని అలా జఫ్ఫా పదం పుట్టిందని అన్నానని బ్రహ్మానందం వెల్లడించారు. శేషు అనే వ్యక్తి తన శిష్యుడని 45 సంవత్సరాల నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నామని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus