Brahmanandam: సీఎం కేసీఆర్‌ను కలసిన బ్రహ్మానందం.. కారణం ఏంటంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావను ప్రముఖ నటుడు బ్రహ్మానందం కలిశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకు కలిశారు ఏంటి సంగతి అని చూస్తే… బ్రహ్మానందం ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్న విషయం బయటకు వచ్చింది. త్వరలోనే ఆయన చిన్న కొడుకు సిద్దార్థ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సమేతంగా ప్రగతి భవన్కు వెళ్లిన ఆయన తన రెండో కుమారుడు సిద్ధార్థ్ వివాహానికి రావాలని సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు.

భార్య, పెద్ద కుమారుడు గౌతమ్‌తో కలసి ప్రగతి భవన్‌కు వెళ్లిన బ్రహ్మానందం (Brahmanandam) తన కుమారుడు సిద్ధార్థ్ శుభలేఖను అందజేశారు. ఈ మేరకు సిద్ధార్థ్‌ పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. సిద్ధార్థ్ వివాహం ఐశ్వర్యతో త్వరలో హైదరాబాద్లో జరగనుంది. కరీంనగర్‌కు చెందిన ప్రముఖ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ వినయ్ కుమార్తె డాక్టర్ ఐశ్వర్యను సిద్దార్థ్ వివాహం చేసుకోనున్నారు. సిద్ధార్థ్ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి ప్రస్తుతం అక్కడే ఉద్యోగరీత్యా సెటిల్ అయ్యారు. ఇక సిద్ధార్థ్ – ఐశ్వర్య ఎంగేజ్‌మెంట్‌ మేలో జరిగింది.

సీఎం కేసీఆర్‌ను కలిసిన సందర్భంగా శుభలేఖతోపాటు శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కేసీఆర్కు బ్రహ్మానందం అందజేశారు. ఈ చిత్రపటాన్ని బ్రహ్మానందం స్వయంగా గీయడం విశేషం. ఈ సందర్భంగా కాసేపు బ్రహ్మానందం ఫ్యామిలీతో సీఎం కేసీఆర్ ముచ్చటించారు. వధూవరుల వివరాలు అడిగి తెలుసుకున్న కేసీఆర్‌. బ్రహ్మానందం ఆరోగ్యం, సినిమాల విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మానందం సినిమాల గురించి చూస్తే… ఇటీవల ఆయన సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు.

అప్పుడప్పుడు సినిమాలు చేశారు. అయితే ఇప్పుడిప్పుడే ఆయన సినిమాల జోరు మళ్లీ పెంచుతున్నారు. రీసెంట్‌గా ‘బ్రో’ సినిమాలో కనిపించారు. ఒక్క సన్నివేశంలోనే కనిపించినా.. స్క్రీన్‌పై ఆయన ఉన్నంతసేపు థియేటర్లలో నవ్వులు పూశాయి. ఆయన ఇదే జోరులో మరిన్ని సినిమాల్లో నటించాలని, పూర్తి స్థాయి పాత్రలు చేయాలని కోరుకుంటున్నారు. మరి ఏ సినిమాతో ఫుల్‌ సైజ్‌ రీఎంట్రీ ఇస్తారో చూడాలి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus