Brahmanandam: చిరంజీవి, బ్రహ్మానందం ఇలా ఎందుకు ఆలోచిస్తారంటే?

పొగిడితే పొంగిపోని వారుండరు. పొగడ్తలు వద్దంటూనే పొగిడితే పరమానందం పడుతుంటారు. ఇలాంటివాళ్లను చాలామంది మీ జీవితంలో చూసి ఉంటారు. అయితే పొగిడి, సన్మానం చేశాక అది తనను కాదు అనుకునేంతగా సాధారణంగా ఉండేవాళ్లను చూశారా? మాకు తెలిసి బయట అలాంటి వాళ్లు కొంతమంది ఉంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో అయితే ఓ ఇద్దరు కనిపిస్తారు. అంటే వీళ్లిద్దరూ ‘ఆ పొగడ్తలు నావి కావు అనుకుంటూ… నేల మీద నిద్రపోతారు’. వాళ్లే చిరంజీవి, బ్రహ్మానందం.

చిరంజీవి, బ్రహ్మానందం మంచి మిత్రులు. ఓ విధంగా బ్రహ్మానందాన్ని తెలుగు సినిమాల్లోకి బలవంతంగా తీసుకొచ్చింది చిరంజీవే. ‘ఎలా నటించరో చూస్తా’ అంటూ సినిమాల్లోకి తీసుకొచ్చారట చిరు. అదొక విషయం అయితే. పొగడ్తలు, సన్మానం విషయంలో కూడా ఇద్దరి మధ్య సారూప్యత ఉంది. ఈ విషయాన్ని బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రకటించారు. తనను ఎవరైనా పిలిచి సన్మానం చేసి… ఇంటికెళ్లాక ఏం చేస్తారో చెప్పుకొచ్చారు బ్రహ్మీ. సన్మాన కార్యక్రమం అయ్యి ఇంటికెళ్లాక…

ఇంట్లోవాల్లు బ్రహ్మానందానికి ఓ చాప, దిండు లాంటివి నేలపై వేసి సిద్ధం చేస్తారట. చక్కగా ఫ్రెష్‌ అప్‌ అయ్యి… వాటి మీద నిద్రపోతారట బ్రహ్మానందం. గతంలో చిరంజీవి కూడా ఇలాంటి విషయమే చెప్పారు. ఆడియో ఫంక్షన్లు, ప్రచార కార్యక్రమాలయ్యాక ఇంటికి వెళ్లి బెడ్‌ మీద కాకుండా నేల మీద నిద్రపోతా. పొగడ్తల వల్ల నన్ను ఆకాశానికెత్తేసుంటారు. అందుకే నేల మీద పడుకుంటే… అక్కడి నుండి కింద పడిపోతా అనే భయం ఉండదు అంటూ సరదాగా చెప్పుకొచ్చారు చిరంజీవి.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus