మరోసారి తాతైన బ్రహ్మానందం..ఈసారి మహాలక్ష్మి పుట్టిందంటూ.. బ్రహ్మీ కొడుకు గౌతమ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

టాలీవుడ్ స్టార్ కమెడియన్, పద్మశ్రీ బ్రహ్మానందం గారు మరోసారి తాత అయ్యారు. ఆయన కొడుకు గౌతమ్, కోడలు జ్యోత్స్న మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. ఈసారి వారికి పండంటి ఆడపిల్ల జన్మించింది. ఈ విషయాన్ని గౌతమ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. గౌతమ్ కొడుకు .. తన చెల్లిని చూస్తూ మురిసిపోతున్న ఫొటోను తీసి.. దానిని సోషల్ మీడియాలో షేర్ చేసి..’అమ్మాయి పుట్టింది.. ఆనందం రెట్టింపు అయ్యింది’ అంటూ పేర్కొన్నాడు గౌతమ్.

అతను షేర్ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బ్రహ్మీ ఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీ. వాళ్ళు ఇంట్లో ఆడపిల్ల ఉండాలి అని ప్రత్యేకంగా కోరుకున్నారు. వారి కోరిక నెరవేరింది. ఆడపిల్ల పుడితే చులకనగా చూసే వాళ్ళంటే తనకి అసహ్యమని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. ఇక గౌతమ్ పోస్ట్ కు… సినీ తారలు కంగ్రాట్స్ చెబుతున్నారు. లక్ష్మీ మంచు, బిందు మాధవి వంటి నటీమణులు అలాగే నెటిజన్లు బ్రహ్మానందం, గౌతమ్‌ లకు హార్టీ కంగ్రాట్స్ అంటూ బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

ఇక గౌతమ్-జ్యోత్స్నల పెళ్లి 2017 లో జరిగింది.ఈ దంపతులకు మొదటి సంతానంగా కొడుకు పుట్టాడు. గౌతమ్ హీరోగా పల్లకిలో పెళ్ళి కూతురు, బసంతి, మను వంటి సినిమాల్లో నటించాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు. అయితే మంచి నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. విలక్షణ నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కానీ అందుకు సరైన పాత్ర కోసం వెయిట్ చేస్తున్నాడు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus