బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌భీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ ‘బ్రహ్మాస్త్ర’. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ‘బ్రహ్మాస్త్ర’… హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తెలుగులో ఈ చిత్రం ‘బ్రహ్మాస్త్రం'( మొదటి భాగం శివ) పేరుతో రిలీజ్ కాబోతుంది. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ మూవీ మొదటి భాగం శివ థీమ్ తో తెరకెక్కింది.
స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగులో రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తుండడం.. నాగార్జున కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్ర పోషించడం,చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడంతో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో ఈ మూవీ ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. బుకింగ్స్ బాగున్నాయి. మరి థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
1.50 cr
సీడెడ్
0.85 cr
ఉత్తరాంధ్ర
0.77 cr
ఈస్ట్
0.26 cr
వెస్ట్
0.20 cr
గుంటూరు
0.35 cr
కృష్ణా
0.35 cr
నెల్లూరు
0.27 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
4.55 cr
‘బ్రహ్మాస్త్రం’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో.. తెలుగు మరియు హిందీ వెర్షన్లతో కలుపుకుని రూ.4.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.4.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. టాక్ కనుక పాజిటివ్ గా వస్తే మంచి ఓపెనింగ్స్ ను రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.