Prabhas: ప్రభాస్ అభిమానులకు ఇదొక ఎక్స్ట్రా టెన్షన్..!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో అలియా భట్, అమితాబ్ బచ్చన్,నాగార్జున వంటి స్టార్లు కీలక పాత్రలో తెరకెక్కుతున్న మూవీ ‘బ్రహ్మాస్త్ర’. రాజమౌళి ఈ చిత్రానికి సమర్పకులు అనే అంశంతో ఈ మూవీ తెలుగులో కూడా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది.మెగాస్టార్ చిరంజీవి తెలుగు వెర్ష‌న్‌ కు వాయిస్ ఓవ‌ర్ అందించబోతున్నారు. మూడు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం సెప్టెంబర్ లో విడుదల కాబోతుంది.

ఈ మధ్యనే ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ట్రైలర్ కట్ బాగానే ఉంది కానీ అందులో గ్రాఫిక్స్ మాత్రం చాలా కామెడీగా ఉన్నాయి. గ్రాఫిక్స్ పై అవగాహన లేని ప్రేక్షకులు కూడా వంకలు పెట్టే విధంగా ఉన్నాయి ఇందులోని గ్రాఫిక్స్. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి కచ్చితంగా… ఆర్‌.ఆర్.ఆర్‌, బాహుబ‌లి2, కేజీఎఫ్2 రికార్డుల్ని బ్రేక్ చేయాలని బాలీవుడ్ ప్రేక్షకులు, మేకర్స్ కోరుకుంటున్నారు. అలాంటి కామెంట్లకి మనం నవ్వుకోవచ్చు కానీ …

మన టాలీవుడ్ స్టార్ హీరో ప్ర‌భాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రానికి కూడా ‘బ్రహ్మాస్త్రం’ చిత్రానికి గ్రాఫిక్స్ డిజైన్ చేసిన‌వాళ్లే చేస్తున్నారు. బ్ర‌హ్మాస్త్ర లానే.. ఆదిపురుష్ గ్రాఫిక్స్ కూడా ఉంటే సినిమాకి మొదట్లోనే నెగిటివిటీ ఏర్పడే అవకాశం ఉంది. 2023 సంక్రాంతి కానుకగా ‘ఆదిపురుష్’ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా 90 శాతం వరకు గ్రాఫిక్స్ పై డిజైన్ చేసిన సినిమానే.

రాజమౌళి స్పూర్తితో మన తెలుగు దర్శకులు అయితే వి.ఎఫ్.ఎక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ క్వాలిటీ ఔట్పుట్ ను రాబట్టుకుంటున్నారు.కానీ ‘ఆదిపురుష్’ ను తెరకెక్కిస్తోంది బాలీవుడ్ దర్శకుడు. పోనీ అతనికి 10 సినిమాలు తీసిన అనుభవం ఉందా? అంటే అదీ లేదు. అందుకే ‘ఆదిపురుష్’ విషయంలో కూడా ప్రభాస్ అభిమానులకి టెన్షన్ పట్టుకుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus