మహేష్ బాబు నటిస్తున్న “బ్రహ్మోత్సవం” ఆడియో విడుదలకు ముందే ఏరియాల వారీగా బిజినెస్ పూర్తికానుంది. ఇప్పటికే నైజాం రైట్స్ ను అభిషేక్ పిక్చర్స్ వారు ఏకంగా 21 కోట్ల రూపాయల భారీ మొత్తానికి పివిపి సంస్థ నుంచి కొనుగోలు చేయగా.. మిగిలిన ఏరియాల నుంచి కూడా భారీ మొత్తాలే ముట్టాయి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం “బ్రహ్మోత్సవం” ప్రి-రిలీజ్ బిజినెస్ విలువ అక్షరాలా 76 కోట్ల రూపాయలు. 40-50 కోట్లలోపు బడ్జెట్ లో తెరకెక్కిన “బ్రహ్మోత్సవం” చిత్రానికి ఈస్థాయిలో బిజినెస్ కావడానికి ముఖ్య కారణం మహేష్ స్టామినా అని కూడా విశ్లేషిస్తున్నారు.
మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీతలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా.. పివిపి పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్నాడు!