సూపర్ స్టార్ మహేష్ స్టామినాను బ్రహ్మోత్సవం సినిమా మరోసారి చాటి చెప్పింది. ఈ చిత్రం రిలీజ్ కి ముందే లాభాలను తెచ్చి పెట్టింది. నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ గా రూ.15 కోట్లను అందించింది. 20 మంది ప్రముఖ నటులతో, భారీ సెట్లతో నిర్మితమైన ఈ సినిమాకు రూ. 70 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. రేపు రిలీజ్ కానున్న ఈ సినిమాను పూర్తిగా అమ్మేశారు. థియేటర్ల రైట్స్ మొత్తంగా 74 కోట్లు, శాటిలైట్స్ హక్కులు 11 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో మొత్తంగా 85 కోట్లు బిజినెస్ చేసింది.
ఏరియాల వారీగా …
నిజాం రూ. 18 కోట్లు, సీడెడ్ రూ. 8.5 కోట్లు, ఆంధ్ర రూ. 25.5 కోట్లు, కర్ణాటక రూ. 6.75 కోట్లు, ఓవర్ సీస్ రూ. 13 కోట్లు, ఇండియా కాకుండా ఇతర ప్రాంతాల్లో రూ. 2 కోట్లు. (మొత్తం దాదాపుగా 74 కోట్లు).
ఈ చిత్రానికి పీవీపీ వారు భారీగా ప్రచారం చేశారు. హిట్ సినిమా శ్రీమంతుడు తర్వాత వచ్చే మహేష్ చిత్రం కావడంతో బ్రహ్మోత్సవం ను డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ రేట్లకు కొన్నారు. అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. రిలీజ్ రోజున తెలంగాణలో 5 షోలను వేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. దీంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీగా లాభాలను తెచ్చి పెడుతుంది అనడంలో సందేహం అవసరం లేదు.