సోషల్ మీడియాలో ఏదైనా విషయం మీద సెటైరికల్ మీమ్ వేయాలి అనుకుంటే… ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అకౌంట్ ఉండటం ఎంత అవసరమో, ఆ సైటైర్ తయారుచేయడానికి బ్రహ్మానందం కూడా అంతే అవసరం. ఏంటి కాదనగలరా చెప్పండి. మీమ్స్ తయారు చేసేవాళ్లకు బ్రహ్మానందం ఒక గొప్ప వరం. ఆయన ఫొటోను రకరకాలుగా వాడేసి మీమ్స్ చేసేస్తుంటారు. మరి అలాంటి మీమ్స్ మేకర్స్ అలియాస్ మీమర్స్ గురించి బ్రహ్మానందం ఏమంటారో తెలుసా?
మీమ్స్ చూసినప్పుడు ‘ఏవండీ మీపై మీమ్స్ చేస్తారు కదా మీకు కోపం రాదా’ అని కొంతమంది అడుగుతుంటారు. మీమ్స్ చేసేవాళ్లను పిలిచి అలా ఎందుకు చేశారు అని అడగొచ్చు కదా అంటుంఆరు. అయితే నాకెప్పుడూ అలా అనిపించదు అన్నారు బ్రహ్మానందం. మీమ్స్ క్రియేటర్స్ అయితే బ్రహ్మానందాన్ని కలసి కలిసి ‘మీరు మా దేవుడండీ’ అన్నారట. నిజానికి వాళ్లకు నేనే థ్యాంక్స్ చెప్పాలి అంటుంటారు బ్రహ్మీ. కొన్ని కారణాల వల్ల ఇటీవల కాలంలో నేను సినిమాల్లో నటిచంలేదు.
అయితే నన్ను మర్చిపోకుండా చేసింది మాత్రం మీమర్సే అన్నారు బ్రహ్మానందం. ఏ సినిమాలో ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చానో గుర్తు పెట్టుకుని మరీ… ప్రస్తుత పరిస్థితులకు తగినట్లు క్రియేట్ చేసిన వాళ్ల కృషికి నా నమస్కారం అని ఆనందంగా చెబుతారు బ్రహ్మానందం. మీమ్స్ చూసి బాధపడి, మనసు నొచ్చుకుంటున్న ఈ రోజుల్లో మీమ్స్‌కి కేంద్రబిందువైన ఆయన ఇలా ఆనందంగా రిసీవ్ చేసుకోవడం అంటే చిన్న విషయమా.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?