Britney Spears: మూడోసారి పెళ్లికి సిద్ధమైన బ్రిట్నీ స్పియర్స్!

బ్రిట్నీ స్పియర్స్ తన ప్రియుడు, నటుడు అయినటువంటి ఫిట్‌నెస్ మాస్టర్ సామ్ అస్గారితో నిశ్చితార్థం చేసుకుంది. 39 ఏళ్ల ఈ గాయని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా వీడియోతో నిశ్చితార్థ ప్రకటన చేసింది. ఇక సామ్ అస్ఘరి అడిగే ముందు ఆమె అక్షరాలా ఉంగరాన్ని చూపిస్తుంది. “మీకు నచ్చిందా?” అని ప్రత్యేకంగా ఆమె ఉంగరాన్ని కూడా చూపించింది. ఇక నిమిషాల్లోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇంతలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో సామ్ అస్గారి బ్రిట్నీ స్పియర్స్ ఎంగేజ్‌మెంట్ రింగ్ క్లోజప్ షాట్‌ను పంచుకున్నారు.

యస్ అని సమాధానం కూడా ఇచ్చాడు. 2016 లో సింగర్ స్లంబర్ పార్టీ మ్యూజిక్ వీడియో సెట్స్‌లో కలిసిన తర్వాత బ్రిట్నీ స్పియర్స్ మరియు సామ్ అస్గారి ప్రేమలో పడ్డారు. సోషల్ మీడియాలో బ్రిట్నీ స్పియర్స్ అభిమానులు కూడా ఈ విషయంలో వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందిస్తున్నారు. బ్రిట్నీ స్పియర్స్ ఇది మూడవ వివాహం. మొదట జాసన్ అలెన్ అలెగ్జాండర్ ను 2004 పెళ్లి చేసుకొని అదే ఏడాది విడిపోయింది. ఇక అదే సంవత్సరం రెండవసారి కెవిన్ ఫీడ‌ర్‌లైన్‌ను బ్రిట్నీ పెళ్లాడింది.

ఇక అతనితో మూడేళ్ళ వరకు ఉండి విడిపోయింది. కెవిన్‌, బ్రిట్నీ జంట‌ల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఇక ఆ తరువాత 2016 నుంచి ఆమె సామ్ అస్గారితో రిలేషన్ లో ఉంటోంది. ఫైనల్ గా మూడవ పెళ్లితో ఈ బ్యూటీ సరికొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నట్లు చెప్పింది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus