పవన్ కళ్యాణ్ – సాయి తేజ్ కాంబినేషన్లో ‘బ్రో’ అనే సినిమా వచ్చింది. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది.టీజర్, ట్రైలర్లు బాగున్నప్పటికీ పాటలు సో సో గానే ఉన్నాయి.జూలై 28 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ.. ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. అయితే వీక్ డేస్ లో మాత్రం ఓపెనింగ్స్ చేతులెత్తేసింది. అయితే ఇప్పటికీ లిమిటెడ్ థియేటర్స్ లో కొద్దిపాటి వసూళ్లు రాబడుతుంది. ఒకసారి 19 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
20.58 cr
సీడెడ్
6.90 cr
ఉత్తరాంధ్ర
6.88 cr
ఈస్ట్
4.90 cr
వెస్ట్
4.44 cr
గుంటూరు
4.48 cr
కృష్ణా
3.50 cr
నెల్లూరు
1.79 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
53.47 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
6.25 cr
ఓవర్సీస్
7.32 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
67.04 cr (షేర్)
‘బ్రో’ (Bro) చిత్రానికి రూ.97.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.98.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 19 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.67.52 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.30.98 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంది.
‘భోళా శంకర్’ ‘జైలర్’ వంటి కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో ‘బ్రో’ ఎక్కువ థియేటర్స్ లో రన్ అవ్వడం లేదు కానీ ఉన్న థియేటర్స్ లో ఓ మోస్తరు కలెక్షన్స్ ను రాబడుతోంది.