ఓటీటీ రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో ప్రేక్షకుడు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాలంటే ఎన్నో ఆలోచిస్తాడు. కచ్చితంగా వాళ్ళని ఆకర్షించే విధంగా సినిమాలో ఎదో ఒకటి ఉండాలి , అప్పుడే ఆడియన్స్ థియేటర్స్ కి కదులుతున్నారు. టాక్ ఏమాత్రం తేడా వచ్చిన థియేటర్స్ వైపు కూడా చూడడం లేదు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీనికి మినహాయింపు అనే చెప్పాలి. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ గత నెల 28 వ తారీఖున గ్రాండ్ గా విడుదల అయ్యింది.
మొదటి రోజు ప్రీమియర్ షోస్ నుండే ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. సినిమాలో పాటలు లేవు , ఫైట్స్ లేవు , డ్యాన్స్ లేవు , కేవలం పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర మాత్రమే ఇందులో పోషించాడు. ఇంత సింపుల్ మరియు ఆఫ్ బీట్ సినిమాని నిలబెట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. పాజిటివ్ టాక్ వచ్చినా ఇలాంటి సినిమాలు నిలబడడం కష్టం.
అలాంటిది నెగటివ్ టాక్ మీద మూడు వారాలు గడిచిన తర్వాత కూడా షేర్ వసూళ్లు ఇంకా వస్తున్నాయంటే అది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా వల్లే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే రీసెంట్ గా రెండు కొత్త సినిమాలు విడుదల అయ్యాయి , ఇక ‘బ్రో ది అవతార్’ చిత్రం రన్ ముగిసిపోయినట్టే అని అందరూ అనుకున్నారు. కానీ ఈ చిత్రానికి నేడు , అనగా ఆగస్టు 15 వ తారీఖున కేవలం బుక్ మై షో యాప్ నుండి 10 వేల టిక్కెట్లు రీసెంట్ గా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రానికి కేవలం మూడు వేల టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయి.
ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ చిత్రం తర్వాత ఆడియన్స్ కి సెకండ్ ఛాయస్ గా ‘బ్రో ది అవతార్’ చిత్రం మాత్రమే నిల్చింది. నేడు మాత్రమే కాదు, ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి (Bro Movie) డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.