పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మొదటి సినిమా ‘బ్రో’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.కేతిక శర్మ హీరోయిన్ కాగా తమన్ సంగీత దర్శకుడు.
టీజర్, ట్రైలర్లు బాగున్నప్పటికీ పాటలు సో సో గానే ఉన్నాయి. దీంతో సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్ ఏర్పడలేదు. ఇక టాక్ కూడా మిక్స్డ్ గా ఉంది. కొంతమంది బాగుంది అంటున్నారు.. మరికొంతమంది బాలేదు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంత మంది థియేటర్ కి వెళ్తారు అనేది పెద్ద ప్రశ్న? అది పక్కన పెట్టేస్తే.. ‘బ్రో’ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం మరికొంతమంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘బ్రో’ ఓటీటీ రిలీజ్ వివరాలు బయటకు వచ్చాయి.
వాటి ప్రకారం.. ‘బ్రో’ (BRO) మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అని తెలుస్తుంది. సినిమా రిలీజ్ అయిన 5 వారాల తర్వాత…నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ చేసుకునేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ రకంగా చూసుకుంటే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘బ్రో’ డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు థియేటర్లలో మిస్ అయితే సెప్టెంబర్ 2 నే ఓటీటీలో చూడగలమన్నమాట.