టాలీవుడ్ లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మూవీగా పేరు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ధృవ మూవీ….ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. అయితే అదే క్రమంలో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న మెగా అభిమానుల ఆశలు ఆవిరి అయిపోకుండా ఉండేలా తీర్చి దిద్దాడు మన దర్శకుడు సురేంద్ర రెడ్డి…ఈ సినిమా కు సూపర్ హిట్ టాక్ వచ్చింది….భారీ హిట్ గా సినిమా రివ్యూస్ ఉండడంతో ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి…ఇదిలా ఉంటే ట్రేడ్ లెక్కల ప్రకారం చూస్తే….ధృవ కన్నా….బ్రూస్ లీ చాలా బెస్ట్ అంటున్నారు యుఎస్ ప్రేక్షకులు…అదేదో సినిమా ప్రకారం కాదండోయ్…ఇదంతా కలెక్షన్స్ లెక్కలు…విషయం ఏమిటంటే…భారీ హంగామా…సూపర్ పాజిటివ్ టాక్, ఇంకా చెప్పాలి అంటే….భీబత్సమైన ప్రమోషన్స్ చేసినప్పటికీ….ధృవ యుఎస్ ప్రిమియర్స్ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు అనేది ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
వాళ్ళు చెబుతున్న లెక్కల ప్రకారం…ముందు రోజు అడ్వాన్స్ బుకింగ్సే ఛాలా డల్లుగా ఉన్నాయట.. ఓవరాల్ కలెక్షన్లు కూడా ఆశాజనకంగా లేవు. ప్రిమియర్స్ ద్వారా ఈ సినిమా కేవలం 2.23 లక్షల డాలర్లు వసూలు చేసింది. డిజాస్టర్ అయిన చరణ్ లాస్ట్ మూవీ ‘బ్రూస్ లీ’కి 2.85 లక్షల డాలర్లు ప్రిమియర్ల ద్వారా వసూలవడం విశేషం. ‘ధృవ’ యుఎస్ ప్రిమియర్ల కోసం ప్రమోషన్ బాగా చేసినా.. రామ్ చరణ్ సహా యూనిట్ అంతా ప్రిమియర్స్ కు హాజరైనా కలెక్షన్లు ఇలా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే ఇదంతా పిచ్చా లైట్ అని, సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో ఈ సినిమా అక్కడ ఉన్న రికార్డులు అన్నీ తిరగ రాస్తుంది అని సినిమా వర్గాలు చెబుతున్నాయి…మరి సంక్రాంతికి ఇంకా టైమ్ ఉండడంతో ఈ సినిమా ఎలా అయినా మంచి కలెక్షన్స్ సాధించాలీ అని ఆశిద్దాం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.