‘ఉప్పెన’ దర్శకుడి బెర్త్‌ కన్ఫర్మ్‌ ఎప్పుడో?

టాలీవుడ్‌లో హిట్‌ కొట్టాక… అందులోనూ బంపర్‌ హిట్‌ కొట్టాక వరుస సినిమాలు వస్తాయి అంటుంటారు. అయితే ఇది కేవలం హీరోయిన్ల విషయంలోనే వర్తిస్తాయేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. దానికి కారణం చాలామంది హీరోలు, దర్శకులు, టెక్నీషియన్లు మంచి హిట్‌ తర్వాత మరో సినిమా కోసం వేచి చూడటమే. సినిమా హిట్‌ అంటే చాలు… అందులో హీరోయిన్‌కి అడ్వాన్స్‌ చెక్‌లు రెడీ చేసేస్తున్నారు మన నిర్మాతలు. దర్శకులు విషయంలోనూ ఇదే జరుగుతోంది. అయితే హీరోలు సెట్‌ అవ్వడం లేదు.

సంక్రాంతి ‘క్రాక్‌’ఫుల్‌ హిట్‌ ఇచ్చిన గోపీచంద్‌ మలినేని తర్వాత సినిమా ఇంకా ప్రారంభించలేదు. ప్రొడ్యూసర్‌ ఓకే అయిపోయారు… హీరో ఎవరు అనేదే తేలలేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానాకి వచ్చింది. రెండో సినిమా ‘మైత్రీ మూవీ మేకర్స్‌’కే అని గతంలోనే ఫిక్స్‌ అయిపోయింది. అయితే ఇంకా హీరో ఎవరూ కుదర్లేదు బుచ్చిబాబుకి. టాలీవుడ్‌ వర్గాల మాటల ప్రకారం అయితే… బుచ్చిబాబు దగ్గర చాలా కథలు ఉన్నాయి. వాటిని కొంతమందికి వినిపించాడు కూడా.

బుచ్చిబాబు తర్వాత సినిమా చేయాలంటే… ఎన్టీఆర్‌తోనే అని తొలుత వార్తలొచ్చాయి. అయితే ఎన్టీఆర్‌ ప్రజెంట్‌ లైనప్‌ చూస్తే… ఇప్పట్లో బుచ్చిబాబు సినిమా పట్టాలెక్కేలా కనిపించడం లేదు. మొన్నామధ్య బుచ్చిబాబును మహేష్‌బాబు మెచ్చుకోవడంతో… నెక్స్ట్‌ మహేషేనా అన్నారు. ఎన్టీఆర్‌లానే మహేషూ బిజీ. మరోవైపు యంగ్‌ హీరోలంతా బిజీబిజీగా ఉన్నారు. దీంతో బుచ్చిబాబు – మైత్రీకి హీరో ఎవరో తెలియడం లేదు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోతోనే బుచ్చిబాబు నెక్స్ట్‌ అనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఎవరో మరి ఆ హీరో.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus