రోజు రోజుకూ థియేటర్ల పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఒకప్పటిలా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడటానికి ఇష్టపడట్లేదు. పెద్ద సినిమా అయ్యుండి, దానికి కూడా టాక్ బాగా వస్తే.. థియేటర్లో చూడటానికి వెళ్తున్నారు. లేదు అంటే ఓటీటీలోనే చూద్దాం అని లైట్ తీసుకుంటున్నారు. చిన్న సినిమాలకి అయితే టాక్ ఎంత బాగా వచ్చినా ఓపెనింగ్స్ రాని పరిస్థితి.ఎందుకంటే టికెట్ రేట్లు. పెద్ద సినిమాలకి టాక్ బాగుంటే ఎంత టికెట్ రేటు పెట్టి అయినా ప్రేక్షకులు థియేటర్లో చూస్తారు.
టికెట్ రేట్లు కనుక పెంచకపోతే వాటికి ఎక్కువ రికవరీ జరగదు. ఈ మధ్య కాలంలో ఏ పెద్ద సినిమా అయినా టికెట్ రేట్లు పెంచకుండా రిలీజ్ చేస్తున్న సందర్భాలు లేవు. మరోపక్క చిన్న సినిమాలకి టికెట్ రేట్లు తగ్గిస్తే కొంత బెనిఫిట్ ఉంటుంది. ప్రస్తుతానికి ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరి హీరోలను తీసుకుందాం. వాళ్ళే అల్లు అర్జున్ (Allu Arjun), అల్లు శిరీష్(Allu Sirish) . ‘పుష్ప’ (Pushpa) సినిమాకి టికెట్ రేట్స్ హైక్ దక్కలేదు.
అందువల్ల ఆ సినిమా ఓపెనింగ్స్ భారీ రేంజ్లో నమోదు కాలేదు. ఫలితంగా ఆంధ్రాలో ఆ సినిమా నష్టాలనే మిగిల్చింది. ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramulo) సినిమాకి టికెట్ రేట్ల హైక్స్ దక్కాయి. ఆ సినిమా భారీ వసూళ్లు సాధించడానికి అదో కారణమైంది. మరోపక్క అల్లు శిరీష్ ‘బడ్డీ’ (Buddy) సినిమా విషయానికి వస్తే.. ఆగస్టు 2 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి టికెట్ రేట్లు తగ్గించారు. సింగిల్ స్క్రీన్స్ లో రూ.99 , మల్టీప్లెక్సుల్లో రూ.125 వరకు చేశారు.
అల్లు శిరీష్ సినిమాలపై జనాలకి ఆసక్తి ఉండదు. టికెట్లు తగ్గించారు కాబట్టి..సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే.. వీకెండ్ వరకు ఆక్యుపెన్సీలు ఉంటాయి. ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo) సినిమాకి హిట్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ రానిది టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్లే. ఏదేమైనా అన్న సినిమాకి టికెట్ రేట్లు పెంచాలి.. తమ్ముడి సినిమాకి టికెట్ రేట్లు తగ్గించాలి. అలాగే ఉంది పరిస్థితి.