Kalki 2898 AD: ‘బుజ్జి – బుజ్జిగాడు’ రొమాన్స్‌.. ‘కల్కి’కి అదే హైలైట్‌ అట!

  • May 23, 2024 / 06:08 PM IST

‘బుజ్జి.. బుజ్జి.. బుజ్జి…’ గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో దీని గురించే చర్చంతా. మామూలుగా అయితే కుర్రాళ్లు తన ప్రేయసిని ఇలా పిలుచుకుంటూ ఉంటారు. దీంతో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాలో హీరోయిన్‌ని ఆ పేరుతో పిలుస్తారని, ప్రభాస్‌ (Prabhas)  అందుకే అలా అంటున్నాడు అని అనుకున్నారంతా. అయితే బుజ్జి అంటే మనిషి కాదు.. కారు అని టీమ్‌ చెప్పేసరికి షాక్‌ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ బుజ్జి మాటలు విన్నాక మరింత షాక్‌ అవుతున్నారు.

ఇలాంటి సమయంలో బుజ్జి కారు మాత్రమే కాదు.. ‘హీరో’యిన్‌ అని తెలసేసరిక ఆ షాక్‌ ఇంకా పెరిగింది. ‘కల్కి’ సినిమాలో బుజ్జి ఎంత కీలకమో.. దానికి సంబంధించిన టీజర్‌ వీడియో బయటకు వచ్చాక తెలిసింది. ‘పేరు చిన్నదే కానీ, సినిమాలో బుజ్జి మామూలుగా ఉండదు’ అని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin)  చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టే.. టీజర్‌లో ప్రభాస్‌ను బుజ్జి అలియాస్‌ కీర్తి సురేశ్ డామినేట్ చేసింది.

బుజ్జి పాత్రకు ప్రముఖ కథానాయిక కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) గొంతు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్‌ మాట వినని ‘హీరో’యిన్‌ లాంటి కారు అది అని టీజర్‌ చూస్తే అర్థం అవుతోంది. ఆ కారుతో సినిమాలో ప్రభాస్‌ కెమిస్ట్రీ భలేగా ఉంటుంది అని చెబుతున్నారు. అది క్లిక్‌ అయితే సినిమాకు మంచి ఎంటర్‌టైన్మెంట్ కూడా అవుతుంది అని చెబుతున్నారు. సినిమాలో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఉన్నా.. ఫన్‌ అయితే బుజ్జితోనే అని చెబుతున్నారు.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. నిన్నటి నుండి ప్రచారం జోరందుకుంది. జూన్‌ 27న సినిమా రిలీజ్‌ అయ్యేలోపు ఇలాంటి ఈవెంట్‌లు, ఇండియా టూర్లు చాలానే ఉన్నాయి అంటున్నారు. అయితే అవి జూన్‌ 4లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాక ఉంటుంది అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితుల బట్టే సినిమా టికెట్‌ ధరలు ఉంటాయి అని మరో టాక్‌ నడుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus