టాలీవుడ్ ఇండస్ట్రీలో డబుల్ హ్యాట్రిక్ సాధించిన అతికొద్ది మంది డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. అనిల్ రావిపూడి ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో బిజీగా ఉండగా దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. సీనియర్ స్టార్ హీరోలందరి సినిమాలకు దర్శకత్వం వహించాలనేది అనిల్ రావిపూడి కల కాగా ఇప్పటికే బాలయ్య సినిమాకు దర్శకత్వం వహించిన అనిల్ కు చిరంజీవి సినిమాకు పని చేసే అవకాశం దక్కిందని తెలుస్తోంది. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఉన్న కథతో చిరంజీవిని కలిశారని చిరంజీవికి అనిల్ చెప్పిన కథ ఎంతగానో నచ్చిందని సమాచారం. అనిల్ రావిపూడి ఈ బంపర్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. చిరంజీవి కామెడీ టైమింగ్ కు సూట్ అయ్యేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. చిరంజీవి 158వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత చిరంజీవి ఈ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన మెజారిటీ సినిమాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా ఈ ప్రాజెక్ట్ కు కూడా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించే ఛాన్స్ అయితే ఉంది. మెగా ఫ్యామిలీతో కూడా దిల్ రాజుకు మంచి అనుబంధం ఉంది. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించి అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
చిరంజీవి త్వరలో రెగ్యులర్ షూటింగ్స్ తో బిజీ కానున్నారని తెలుస్తోంది. చిరంజీవికి భవిష్యత్తు సినిమాలతో వరుసగా భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చిరంజీవికి ఈ జనరేషన్ లో ఉన్న ఫ్యాన్స్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.