Allu Arjun-Bhansali: ఆ స్టార్ డైరెక్టర్ తో బన్నీ సినిమా లేనట్లేనా..?

మన స్టార్ హీరోలు ఏ సినిమాలు చేస్తున్నారనే విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. వాళ్లు చేస్తున్న సినిమాల స్టేటస్ ఏంటి..? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ల పరిస్థితేంటి..? అనే విషయాలు తెలుసుకోవాలని చూస్తుంటారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన అల్లు అర్జున్ కొత్త సినిమాలపై ఎప్పుడూ సస్పెన్స్ నడుస్తూనే ఉంటుంది. హడావిడిగా సినిమాలు చేయడం బన్నీకి నచ్చదు. కొందరు స్టార్ ఒకేసారి రెండు, మూడు సినిమాలను లైన్ లో పెడుతుంటారు.

సమాంతరంగా సినిమాలు చేస్తుంటారు. ఇంకొందరేమో.. ఒక సినిమా చేస్తుండగానే మరో సినిమాకి అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటారు. కానీ బన్నీ మాత్రం ఇలా చేయరు. ఒక సినిమాకి, ఇంకో సినిమాకి గ్యాప్ తీసుకుంటారు. ‘నా పేరు సూర్య’ విడుదలైన రెండేళ్ల తరువాత ‘అల.. వైకుంఠపురములో’ సినిమా వచ్చింది. ఆ తరువాత ‘పుష్ప’ సినిమా మొదలుపెట్టడంలో ఆలస్యం జరిగింది. దీని తరువాత ‘పుష్ప2’కి కూడా గ్యాప్ తప్పలేదు. మధ్యలో మరో సినిమా చేసే ఛాన్స్ ఉన్నా..

బన్నీ మాత్రం చేయలేదు. ‘పుష్ప2’ తరువాత సినిమా మీద కూడా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఇటీవల సంజయ్ లీలా భన్సాలీని అల్లు అర్జున్ కలవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బన్నీ మిత్రుడు, నిర్మాత బన్నీ వాసు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం బన్నీ చేతిలో ‘పుష్ప2’ తప్ప మరో సినిమా లేదని అన్నారు.

భన్సాలీకి ‘పుష్ప’ నచ్చిందని.. అలానే బన్నీకి ‘గంగూబాయి కతియవాడి’ నచ్చిందని.. ఈ నేపథ్యంలో ఒకరినొకరు కలవాలనుకున్నారని చెప్పారు బన్నీ వాసు. కుదిరినప్పుడు కలిశారని.. అంతకుమించి వారి కాంబినేషన్ కి ఎలాంటి ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. బన్నీ కొత్త సినిమాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus