ఫలానా సినిమాకు ఫలానా హీరో అంత రెమ్యూనరేషన్ తీసుకున్నారట. రికార్డు స్థాయిలో ఆ కథానాయకుడు పారితోషికం అందుకున్నాడట. ఇలాంటి వార్తలు మీరు చాలా చదివే ఉంటారు. ఇందులో నిజానిజాలు మనకు కచ్చితంగా తెలియవు. ఎందుకంటే ఆ లెక్కలు ఎవరూ చెప్పరు. కేవలం సమాచారం అని మాత్రమే తెలుస్తుంది. అయితే కొంతమంది హీరోల రెమ్యూనరేషన్లు హైప్ కోసం చెప్పేవే అవ్వొచ్చు అంటున్నారు నిర్మాత బన్ని వాస్. హీరోల రెమ్యూనరేషన్‌ల గురించి బయట చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు.
కానీ అది చాలా సెన్సిటివ్ లేయర్ అన్నారు బన్ని వాస్. ‘‘హీరోలు తమ రెమ్యూనరేషన్లు పెంచారని అనుకుంటూ ఉంటారు.. అయితే హీరోలు కూడా సినిమా బిజినెస్‌లో భాగమే. సినిమా, నిర్మాత ఇబ్బందుల్లో ఉంటే చాలామంది హీరోలు ముందుకొచ్చి ఆదుకున్నారు. రిలీజ్ రోజు డబ్బులు సెట్ కాకపోతే రెమ్యూనరేషన్ తర్వాత ఇవ్వమని కోపరేట్ చేసే హీరోలను చాలా మందిది చూశా’’ అని చెప్పారు బన్ని వాస్. అలాంటి హీరోల్లో చిన్న హీరోలు, మిడ్ రేంజ్ హీరోలు కూడా ఉన్నారని, ఆ తర్వాత వాళ్ల రెమ్యూనరేషన్లు తీసుకోలేకపోయిన, ఇవ్వలేకపోయిన సందర్భాలూ ఉన్నాయని చెప్పారు.
ఇండస్ట్రీలో చాలా తక్కువ మందే రెమ్యూనరేషన్లపై పట్టుబట్టి కూర్చుంటారని చెప్పారు. అలాగే రూ.కోట్లలో రెమ్యూనరేషన్ అనేది కేవలం హైప్ కోసం చెప్పే మాట అని, ప్రతి హీరోకు, ప్రతి సినిమాకు రెమ్యూనరేషన్ అనేది మారిపోతూ ఉంటుంది అని చెప్పార బన్ని వాస్. సినిమా మంచి విజయం సాధిస్తేనే రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు మన ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పారు. మన హీరోలు సినిమాకు ఏదైనా ఇబ్బంది వస్తే అర్థం చేసుకొని, సర్దుబాటు చేసుకుంటారని చెప్పారాయన.
టాలీవుడ్‌లో దర్శకులు, నిర్మాతలకు హీరోల నుండి అంతలా సహకారం అందుతోంది కాబట్టే మన నుండి పాన్ ఇండియాలు సినిమాలు వస్తున్నాయి, అంతేసి విజయాలు సాధిస్తున్నాయని చెప్పారు బన్ని వాస్. ఈ లెక్కన భారీ పారితోషికాల లెక్క ఇదని అర్థమవుతోంది. ఇదే నిజమైతే టాలీవుడ్ హీరోలు సూపర్ అని మరోసారి అనొచ్చు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!