‘దూకుడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మహేష్ బాబు నుండీ వచ్చిన చిత్రం ‘బిజినెస్ మెన్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఆర్.ఆర్ మూవీ మేకర్స్’ బ్యానర్ పై ఆర్.ఆర్.వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మహేష్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం అందించాడు.మహేష్ బాబు నెగిటివ్ రోల్ ప్లే చేసిన మూవీ ఇది.నిజానికి ఓ స్టార్ హీరో ఇలా నెగిటివ్ డైమెన్షన్ కనిపిస్తే సినిమా హిట్ అవుతుంది అనే గ్యారెంటీ ఉండదు.
కానీ 2012వ సంవత్సరం జనవరి 13న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. నేటితో ఈ చిత్రం విడుదలై 10ఏళ్ళు పూర్తికావస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 12.40 cr |
సీడెడ్ | 5.70 cr |
ఉత్తరాంధ్ర | 3.40 cr |
ఈస్ట్ | 3.10 cr |
వెస్ట్ | 2.50 cr |
గుంటూరు | 3.70 cr |
కృష్ణా | 2.25 cr |
నెల్లూరు | 1.35 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 34.40 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.50 Cr |
ఓవర్సీస్ | 3.50 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 40.40 cr |
‘బిజినెస్ మెన్’ చిత్రానికి రూ.37 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.40.40 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్లకి ఈ చిత్రం రూ.3.40 కోట్ల లాభాలను అందించింది. ఈ చిత్రాన్ని చాలా చోట్ల నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. బడ్జెట్ పై చూసుకుంటే ఈ చిత్రం ‘దూకుడు’ కంటే కూడా నిర్మాతలకి ప్రాఫిటబుల్ అని చెప్పాలి.పోటీగా వెంకటేష్ ‘బాడీగార్డ్’ చిత్రం ఉన్నప్పటికీ ‘బిజినెస్ మెన్’ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. మొత్తానికి ‘బిజినెస్ మెన్’ విజయంతో మహేష్ బాబు తన గుడ్ ఫామ్ ను ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వరకు కంటిన్యూ చేసాడు.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!