థియేటర్‌లో పూనకాలే వస్తాయో… ప్రళయాలే వస్తాయో

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ చూశారా? చూసే ఉంటారు లెండి? అయితే అందులో మీకు ఓ చోట డౌట్‌ వచ్చి ఉండొచ్చు. అదే రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ మధ్య వచ్చే ఫైట్‌. ట్రైలర్‌ మిడిల్‌లో ఈ సీన్స్‌ రెండు కనిపిస్తాయి. అరె… సినిమాలో ఇద్దరు హీరోల మధ్య ఫైటేంటి అని అందరూ అనుకునే ఉంటారు. ఇదే విషయం ఆ మధ్య రాజమౌళి దగ్గర ప్రస్తావిస్తే… సినిమాలో చూపిస్తాం కదా ఎందుకో అని ఆ మిస్టరీని అలానే ఉంచేశారు.

దీంతో అభిమానులు, ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. అయితే ఇప్పుడు ఆ సీనే కీలకంగా మారాయా? అవుననే అంటున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కోసం తారక్‌ వర్సెస్‌ రామ్‌చరణ్‌ అనే కాన్సెప్ట్‌నే రాజమౌళి ఎంచుకున్నారని టాక్‌. ఈ ఇద్దరి మధ్య భీకరమైన ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కమ్ ఫైట్‌ షూట్‌ చేశారని చెబుతున్నారు. సినిమా హైలో ఉన్నప్పుడు ఫైట్‌ సీన్‌ స్టార్ట్‌ అవుతుందని, ఆ ట్రాన్స్‌లో ఫ్యాన్స్‌ ఉన్నప్పుడు సినిమాకు ఇంటర్వెల్‌ ఇస్తారని టాక్‌.

దాంతో సెకండాఫ్‌ కోసం ప్రేక్షకుల మనసులో చాలా ఆలోచనలు క్రియేట్‌ చేసి థియేటర్‌లో లైట్లు ఆన్‌ చేస్తారని టాక్‌. ఒకవేళ ఇదే జరిగితే థియేటర్‌లో పూనకాలు పక్కా అని తెలుస్తోంది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ పాత్రల మధ్య స్నేహాన్నే ఎక్కుగా ట్రైలర్‌, టీజర్‌లో చూపించారు. ఇద్దరి మధ్య వైరాన్ని ఓ పాటలో వినిపించారు. ట్రైలర్‌లో రెండో, మూడో సీన్సే చూపించారు. అయితే ఇప్పుడు ఏకంగా 15 నిమిషాల ఇంటర్వెల్‌ ఫైట్‌ … అది కూడా చరణ్‌, తారక్‌ మధ్య అంటే మామూలుగా ఉండదు.

మరి ఈ ఫైట్‌ను రాజమౌళి ఎలా చిత్రీకరించారు. ఇద్దరి ఫ్యాన్స్‌ హర్ట్‌ అవ్వకుండా, ఒకరిపై ఇంకొకరిది పై చేయిలా కనిపించకుండా ఎంత జాగ్రత్తగా తెరకెక్కించారు అనేది ఆసక్తికరంగా మారింది. అప్పటివరకు బ్రిటీషు హాయంలో పోలీసుగా పని చేసే రామ్‌చరణ్‌… తారక్‌ను అరెస్టు చేసే క్రమంలో ఈ ఫైట్‌ ఉంటుందని భోగట్టా. ఆ తర్వాత చరణ్‌ ఏం తెలుసుకున్నాడు, తారక్‌తో కలసి తెల్లవారిపై ఎలా పోరాడారు అనేది సినిమాలో చూసి తెలుసుకోవాలి. ముందు చెప్పినట్లు ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం జనవరి 7న వస్తుంది. సో వెయిట్‌ అండ్‌ సీ.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus