టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్… ఈ విషయంలో చాలా ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. మామూలుగా అయితే ఇలాంటి టాపిక్ ఎక్కువగా చర్చకు వస్తుంటుంది. కానీ ఓ నిర్మాత, అందులోనూ సీనియర్ నిర్మాత ఈ టాపిక్ గురించి మాట్లాడారు. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆయన టాలీవుడ్ కంటే బాలీవుడ్ ఓ విషయంలో తోపు అనే అర్థం వచ్చేలా మాట్లాడారు కాబట్టి. టాలీవుడ్‌లో చాలా రోజుల క్రితం కొన్ని రోజుల పాటు సినిమా చిత్రీకరణలు ఆపేశారు.
కరోనా – లాక్‌డౌన్ కష్టాలు తగ్గించుకోవడానికి ఆ పని చేసింది టాలీవుడ్. దాని గురించి సి.కల్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా నిర్మాణ వ్యయాలు పెరగడానికి చాలా కారణాలున్నాయి. గతంలో నిర్మాతల చేతిలో ఇది పట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే ఎవరికీ సినిమా నిర్మాణం మీద నియంత్రణ లేకుండా పోయింది. అందుకే కొన్ని నెలలు సినిమా చిత్రీకరణలు ఆపి డబ్బు ఎక్కడ వృథా ఎక్కడ జరుగుతోంది అనే విషయంలో చర్చలు పెట్టుకున్నారు.
అయితే ఈ క్రమంలో వచ్చిన ఆలోచనలు, సూచనలు, మార్పులు ఆసక్తికరంగా అనిపించాయి. కానీ అలా చేస్తే సినిమాలు తీసే పరిస్థితి ఉండదనే ఫీలింగ్‌లోకి నిర్మాతలు వచ్చేసినట్లున్నారు. అందుకే ఇప్పుడు టాలీవుడ్‌లో పాత పరిస్థితే వచ్చేసింది. అప్పటిలాగే ఇప్పుడు ఉన్నాయి అని నిర్మాత సి.కల్యాణ్ చెప్పారు. అయితే హిందీలో పరిస్థితి ఇలా లేదని, సినిమా అనుకున్నాక 60 రోజుల్లో సినిమా పూర్తవుతోందని సి.కల్యాణ్ (C Kalyan) చెప్పారు. దీని వల్ల ఖర్చు విషయంలో బాలీవుడ్ కంటే టాలీవుడ్ కాస్త వెనుకబడింది అనేలా చెప్పారు.
అతేకాదు టాలీవుడ్‌లో అలాంటి వ్యవస్థ లేదని తేల్చేశారు. దీంతో టాలీవుడ్‌కి చాలా ఏళ్లుగా సమస్యగా ఉన్న ఈ విషయాన్ని ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారు అనే చర్చ మళ్లీ మొదలైంది. ఈ విషయంలో నిర్మాతలు ఎప్పటికి ఓ నిర్ణయానికి వస్తారో చూడాలి. నిర్మాణం, నిర్మాణ వ్యయం, రెమ్యూనరేషన్లు, అదనపు ఖర్చులు ఇలా అన్నీ ఈ లెక్కకే వస్తాయి. ఇవి తగ్గితే టికెట్ రేట్ల పెంపు కూడా ఉండదు. కాబట్టి ఈ విషయం ప్రేక్షకులకూ చాలా అవసరం.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!