ప్రముఖ యాంకర్,నటి అయిన అనసూయ భరద్వాజ్.. విజయ్ దేవరకొండ పై పగ ఉన్నట్టు పరోక్షంగా ‘లైగర్’ సినిమా రిజల్ట్ గురించి విమర్శించి హాట్ టాపిక్ అయ్యింది. దీంతో అభిమానులు ఆమెను తిట్టిపోయడం, ఆంటీ అని పిలవడం జరిగింది. ఆంటీ అని పిలవడం పై అనసూయ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతి అనవసరమైన కామెంట్ కు ఆమె రియాక్ట్ అవుతుంది.అంతే కాదు ఆంటీ అని పిలిచే ప్రతి నెటిజెన్ పై కేసు పెట్టి జైల్లో పెట్టిస్తాను అంటూ కామెంట్లు పెట్టింది.
దీంతో ట్విట్టర్లో ‘ఆంటీ’ అనే ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. అనసూయని ప్రతి ఒక్కరూ ఆడేసుకుంటున్నారు. అయితే అందరిలోనూ ఓ సందేహం ఉంది. ఆంటీ అని పిలిచినంత మాత్రాన నిజంగా కేసు పెట్టి, జైలుకి పంపొచ్చా అని..! దీని పై కొంతమంది న్యాయ నిపుణులు.. స్పందించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. వారి అనాలిసిస్ ప్రకారం.. ” ‘ఆంటీ’ అని పిలవడం నేరం కాదు. కానీ, ఆంటీ అంటూ టీజ్ చేయడం,మహిళలను మనోవేదనకు గురి చేయడం మాత్రం తప్పే. ఉద్దేశ పూర్వకంగా ఆమెను వేధిస్తున్నట్టే లెక్క.
కాబట్టి కేసు పెట్టుకునే రైట్ సదరు బాధితురాలికి ఉంది. కానీ అనసూయ చెప్పినట్టు జైల్లో పెట్టించే రేంజ్లో అయితే కేసు నిలబడకపోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా కేసు పెట్టుకునే అవకాశం ఉందట. కానీ ఇద్దరు పిల్లలు ఉన్న అనసూయ వంటి వారు కేసు పెట్టినా అది చెల్లకపోవచ్చు అని మరికొందరు చెబుతున్నారు.
పరువు నష్టం దావా వేసే రైట్ కూడా లేదట. ఇలాంటి కేసులు వేస్తే కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు బాధితురాలి పైనే రివర్స్ లో న్యాయస్థానం మొట్టికాయలు వేసే అవకాశం ఉండొచ్చు అని మరికొందరు అంటున్నారు. అయితే ప్రత్యక్షంగా ఎవరైనా మహిళను ఇలా టీజ్ చేస్తే పోలీసులు చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంది. అది కూడా కోర్టులో నిందితులను హాజరుపరిచి రూ.499 ఫైన్ కట్టిస్తారట.