Calling Sahasra Collections: సుడిగాలి సుధీర్ ‘కాలింగ్ సహస్ర’ 5 వ రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Ad not loaded.

బుల్లితెర పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్‌ అలియాస్ సుధీర్ ఆనంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్ర’. ‘షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌’, ‘రాధా ఆర్ట్స్’ బ్యానర్ల పై విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డాలీషా హీరోయిన్‌గా నటించింది. డిసెంబ‌ర్ 1న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్.. కొత్తగా ఉన్నాయి.

మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. వీక్ డేస్ లో ఈ మూవీ మరింత దారుణంగా కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి.ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.15 cr
సీడెడ్ 0.08 cr
ఆంధ్ర 0.14 cr
ఏపీ + తెలంగాణ 0.37 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్ 0.04 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.41 cr

‘కాలింగ్ సహస్ర’ చిత్రానికి రూ.2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.8 కోట్ల షేర్ ను రాబట్టాలి. 5 డేస్ పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం రూ.0.41 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో 2.39 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఈ టాక్ తో అంత టార్గెట్ ను రీచ్ అవ్వడం అంటే చిన్న విషయం అయితే కాదు. ‘యానిమల్’ కూడా బాక్సాఫీస్ వద్ద చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో ‘కాలింగ్ సహస్ర’ ని జనాలు పట్టించుకోవడం లేదు అని స్పష్టమవుతుంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus