Calling Sahasra Twitter Review: ‘కాలింగ్ సహస్ర’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్‌ అలియాస్ సుధీర్ ఆనంద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్ర’. ‘షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌’, ‘రాధా ఆర్ట్స్’ బ్యానర్ల పై విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డాలీషా హీరోయిన్‌గా నటించింది. డిసెంబ‌ర్ 1న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్.. కొత్తగా ఉన్నాయి. ఇది ఒక థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన మూవీ.

సుధీర్ కి ఇది కొత్త ప్రయత్నం. టైటిల్ కూడా కొత్తగా ఉంది. ఈ సినిమా (Calling Sahasra) కోసం సుధీర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ సినిమా చూసిన కొంతమంది ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్నా.. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ బాగానే ఉంది అని అంటున్నారు. మొత్తంగా యావేరేజ్ ఫస్ట్ హాఫ్ అనుకోవచ్చట. సెకండ్ హాఫ్ లో చాలా వరకు సీరియస్ గానే సాగిందని, క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంది అని అంటున్నారు.

క్లైమాక్స్ లో సుధీర్ విషయంలోనే ఊహించని ట్విస్ట్ ఉంటుందట. దానిని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దానిపై సినిమా బాక్సాఫీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది అంటున్నారు. ఈ సినిమా విషయంలో కొత్తగా ట్రై చేసినందుకు అభినందించొచ్చు అని మరి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. చూడాలి మరి మిగిలిన ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో :

https://twitter.com/JohnDur47709207/status/1730459351398412603

 

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus