ఈసారి రెబల్ స్టార్లు ఇద్దరూ హిట్ కొడతారా?

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువ. ప్లాప్ కాంబినేషన్ రిపీట్ చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించరు. మరి, పెదనాన్న కృష్ణంరాజు కోసం ప్రభాస్ ఆ సెంటిమెంట్ పక్కన పెడతారేమో చూడాలి. రెబల్ స్టార్ వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి… టాలీవుడ్‌లో యంగ్ రెబల్ స్టార్ అనిపించుకుని, తరవాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బాహుబలిగా ఎదిగి, ఆ తరవాత సాహో అనిపించుకున్న హీరో ప్రభాస్. అభిమానులకు ప్రభాస్, కృష్ణంరాజు కలిసి యాక్ట్ చేస్తే చూడాలని కోరిక. ‘ఆదిపురుష్’తో ఆ కోరిక తీరుతుందేమో చూడాలి.

రామాయణం ఆధారంగా తెలుగు, హిందీ లాంగ్వేజెస్‌లో త్రీడీలో రూపొందుతున్న సినిమా ‘ఆదిపురుష్’. ఓమ్ రౌత్ డైరెక్టర్. చాలా రోజులుగా యాక్టింగ్‌కి దూరంగా వున్న కృష్ణంరాజు ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నారని ఇండస్ట్రీ టాక్. ‘ఆదిపురుష్’లో ఆయన యాక్ట్ చెయ్యనున్నారట. ఫ్లాష్‌బ్యాక్‌లో మైథలాజికల్ మూవీ చేసిన ఎక్స్‌పీరియన్స్ కృషంరాజుకు వుంది. ఆయన ‘భక్త కన్నప్ప’ చేశారు. అందుకని, ‘ఆదిపురుష్’లోకి ఆయనను తీసుకుంటున్నారట. కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ‘బిల్లా’. కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు.

అది ప్లాప్. ఇన్ కేస్, ‘ఆదిపురుష్’లో కృష్ణంరాజు వుంటే ఆ ప్లాప్ సెంటిమెంట్‌ను పక్కనపెట్టి పెదనాన్నతో ప్రభాస్ యాక్ట్ చేస్తున్నారని అనుకోవాలి. ఈసారి హిట్ కొట్టాలని రెబల్ స్టార్ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా కాస్టింగ్ విషయంలో చాలా వార్తలు వస్తున్నాయి. సీతగా కీర్తీ సురేష్ నుండి ఊర్వశి రౌటేలా, అనుష్క శర్మ, అనుష్క శెట్టి వరకు పలు పేర్లు వినబడుతున్నాయి. యూనిట్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus