పవన్ రికార్డు బ్రేక్ చేసే బాధ్యత తీసుకున్న ప్రభాస్

  • September 7, 2020 / 09:25 PM IST

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన బర్త్ డే వేడుకల కోసం సిద్ధం అవుతున్నారు. నిన్న ప్రభాస్ బర్త్ డే సీడీపీ కూడా లాంచ్ చేయడం జరిగింది. బాహుబలి గెటప్ లో ప్రభాస్ ఉండగా ఆ ఫోటో చుట్టూ ఉన్న ఫ్రేమ్ లో ఆయన నటించిన చిత్రాలు పేర్లు ఉన్నాయి. ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23, అంటే 40రోజులకు పైనే సమయం ఉంది. అయినప్పటికీ వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన బర్త్ డే ఘనంగా చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు.

మరో వైపు తమ అభిమాన హీరో పేరిట వరల్డ్ రికార్డు నెలకొల్పాలనే తపనతో ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బర్త్ డే ట్యాగ్ ట్రెండ్ చేయడం అనేది ఫ్యాన్స్ లో క్రేజీగా తయారయ్యింది. అలాగే సోషల్ మీడియాలో తమ హీరో బర్త్ డే ట్యాగ్ తో వరల్డ్ రికార్డు సెట్ చేయాలనే లక్ష్యం పెట్టుకుంటున్నారు. మహేష్ బర్త్ డే నాడు ఆయన అభిమానులు 62.2 మిలియన్ ట్వీట్స్ తో వరల్డ్ రికార్డు నెలకొల్పారు. ఈ రికార్డుని పవన్ ఫ్యాన్స్ బర్త్ డే సీడీపీతో బ్రేక్ చేయడం జరిగింది.

పవన్ బర్త్ డే సీడీపీ ట్యాగ్ ని భారీగా ట్రెండ్ చేసిన ఫ్యాన్స్ 65.1 మిలియన్ ట్వీట్ తో సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. దీనితో ఈ రికార్డు బ్రేక్ చేయాల్సిన బాధ్యత ప్రభాస్ ఫ్యాన్స్ తీసుకున్నారు. ప్రభాస్ బర్త్ డే సీడీపీ లేదా బర్త్ డే ట్యాగ్ తో పవన్ ఫ్యాన్స్ నెలకొల్పిన రికార్డు బద్దలు కొట్టాలని చూస్తున్నారు. ఇక ప్రభాస్ బర్త్ డే నాడు రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ తో పాటు ఆదిపురుష్ మరియు నాగ్ అశ్విన్ చిత్రాల నుండి కూడా అప్డేట్స్ రానున్నాయి.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus