Prabhas: ప్రభాస్ ఆ రికార్డులను బ్రేక్ చేయగలరా..?

బాహుబలి సిరీస్ సినిమాలతో స్టార్ హీరో ప్రభాస్ భారీస్థాయిలో ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 800 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించిన ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో కలెక్షన్లపరంగా ఎన్నో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అయితే ప్రభాస్ తన తరువాత సినిమాలతో ఈ కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేయాల్సి ఉంది. బాహుబలి2 సినిమా కేవలం 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది.

బడ్జెట్ ఎక్కువమొత్తం కాకపోయినా ఈ సినిమా బడ్జెట్ కు 5 రెట్ల షేర్ కలెక్షన్లను సాధించింది. ప్రభాస్ సాహో సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆ సినిమాకు కలెక్షన్లు ఎక్కువగా రాలేదు. అయితే ప్రభాస్ తన తరువాత సినిమాలతోనైనా బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేయడం లేదా బాహుబలి 2 సినిమా స్థాయిలో కలెక్షన్లను సాధించాల్సి ఉంది. రాబోయే 18 నెలల్లో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ఈ సినిమాలలో ఏ సినిమాతోనైనా బాహుబలి2 రికార్డులను క్రాస్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది. ఈ మూడు సినిమాలు వేర్వేరుగా 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు కావడం గమనార్హం. రాధేశ్యామ్ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. త్వరలో ఈ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. బాహుబలి2 కలెక్షన్లు ప్రభాస్ పై పరోక్షంగా ఒత్తిడిని పెంచుతున్నాయని సమాచారం.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus