Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?
- July 14, 2026 / 05:06 PM ISTByPhani Kumar
సత్యదేవ్ హీరోగా ‘రావు బహదూర్'(Rao Bahadur) అనే సినిమా వచ్చింది. వెంకటేష్ మహా దీనికి దర్శకుడు. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య’ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. దీంతో మొదటి నుండి ‘రావు బహదూర్’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఎప్పటిలానే సత్యదేవ్ నటనపై ప్రశంసల వర్షం కురిసింది.
Rao Bahadhur

కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ సినిమాకి మహేష్ బాబు, నమ్రత సమర్పకులుగా వ్యవహరించారు. అందువల్ల సినిమాకి బిజినెస్ బాగా జరిగింది. ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఓవర్సీస్ బిజినెస్ కూడా బాగా జరిగింది. అలా పెట్టిన బడ్జెట్లో మేజర్ పర్సెంటేజీ రికవరీ జరిగింది. ధియెట్రీకల్ గా మాత్రం అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు. ‘లెనిన్’ రాకతో ‘రావు బహదూర్’ ని ఆల్మోస్ట్ అంతా మర్చిపోయారు.
కానీ చిత్ర బృందం మాత్రం పలువురు సెలబ్రిటీస్ తో ఈ సినిమాకి పుషింగ్ ఇవ్వాలని భావిస్తోంది. తాజాగా సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రం పై స్పందించాడు. ఈ సినిమా కోసం ఆడియన్స్ కచ్చితంగా 3 గంటలు కేటాయించాలని కోరాడు. లిమిటెడ్ బడ్జెట్ లో దర్శకుడు వెంకటేష్ మహా.. ‘రావు బహదూర్’ ని చాలా బాగా తెరకెక్కించాడని తెలిపాడు. కంటెంట్..కి ఇంప్రెస్ అయితే తప్ప సందీప్ రెడ్డి వంగా ప్రత్యేకంగా ఓ సినిమాని ప్రమోట్ చేసే రకం కాదు. దీంతో ఆయన్ని అభినందించేవారు ‘రావు బహదూర్’ ని చూసే అవకాశం ఉంది.
మరోవైపు రాహుల్ రవీంద్రన్ కూడా ‘రావు బహదూర్’ సినిమాపై స్పందించాడు. రైటింగ్ అద్బుతం అంటూ కొనియాడాడు. అయితే వీళ్ళ పుషింగ్ అనేది సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి..!
‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్













