Bigg Boss: సంచాలక్ గా అరియానా సూపర్..! కానీ ఆర్గ్యూమెంట్ లో ఏం జరిగిందంటే..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ హౌస్ మేట్స్ మద్యలో చిచ్చు పెట్టింది. కెప్టెన్సీ పోటీదారులకి కీలుగుర్రం టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో చెక్క గుర్రాలని పెట్టి వాటిపై కూర్చోమన్నాడు. గుర్రం పరిగెత్తే సౌండ్ వచ్చినపుడల్లా ఏ హౌస్ మేట్స్ అయితే బెల్ కొడతారో ఆ హౌస్ మేట్ కి ఒకర్ని ఎలిమినేట్ చేసే చాన్స్ దక్కుతుంది. గుర్రం సకిలించిన సౌండ్ రాగానే తగిన కారణాలు సంచాలక్ కి చెప్పి ఆ హౌస్ మేట్ ని కెప్టెన్సీ రేస్ నుంచీ తొలగించవచ్చు.

Click Here To Watch NOW

ఇక్కడే ముందు అనిల్ ని అఖిల్ తొలగించాడు. తర్వాత మిత్రాశర్మా మహేష్ ని తొలగించింది. ఈ టాస్క్ లో ముఖ్యంగా అరియానా సంచాలక్ గా సూపర్ గా తన పని చేసినా కూడా, హౌస్ మేట్స్ కి బాగా వ్యతిరేకం అయిపోయింది. అయితే, ఆర్గ్యూమెంట్ లో మాత్రం లాజిక్ లేకుండా హౌస్ మేట్స్ ఏదో విషయంలో అరియానాపై ధ్వజమెత్తారు. ఫస్ట్ లో బిందుమాధవి, ఆ తర్వాత హమీదా, సరయు ఇలా అరియానాని లాజికల్ గా లాక్ చేసేందుకు చూశారు. తేజస్వి కూడా చివర్లో అరియానాతో గొడవకి దిగింది.

తన నిర్ణయం ప్టల అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇద్దరి మద్యలో గట్టి ఆర్గ్యూమెంట్ అయ్యింది. నువ్వు నన్ను కూర్చోమని చెప్పావని అందుకే కూర్చున్నాని అన్నది. నాకు విషయం తెలీదని అలా తెలిస్తే చెప్పేదాన్ని కాదు కదా అంటూ అరియానా ఎక్స్ ప్లనేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. చివర్లో యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్, అజయ్ ముగ్గురూ ఉన్నప్పుడు బిగ్ బాస్ ఈరోజు కెప్టెన్సీ టాస్క్ ఇంతటితో ముగిసిందని ఎనౌన్స్ చేశాడు. తిరిగి రేపు మళ్లీ గుర్రం టాస్క్ స్టార్ట్ అవుతుందని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇక్కడే అఖిల్ నాకు సపోర్ట్ చేయాలనిపిస్తేనే నీకు చేస్తానని క్లియర్ గా అజయ్ తో చెప్పాడు. మార్నింగ్ ఇద్దరి మద్యలో జరిగిన గొడవలో కూడా అఖిల్ అజయ్ కి గట్టి క్లాస్ పీకాడు. అజయ్ కూడా అఖిల్ తో ఆర్గ్యూమెంట్ చేశాడు. ఆతర్వాత ఇద్దరూ కలిసిపోయారు. సాయంత్రం కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పటి నుంచీ అజయ్ కి అఖిల్ సపోర్ట్ గానే ఉన్నాడు.చివరిరోజు అయిన కెప్టెన్సీ టాస్క్ లో ఈవారం ఎవరు కెప్టెన్ అవుతారు అనేది ఆసక్తికరం.

ఇప్పటికే ఇంట్లో రెండు మూడుసార్లు కెప్టెన్సీ రేస్ లోకి వచ్చి చివరికి వరకూ పోరాటం చేసిన యాంకర్ శివకి హౌస్ మేట్స్ మద్దతు ఎక్కువగానే ఉంది. అలాగే, నటరాజ్ మాస్టర్ కి కూడా తేజు అండ్ గ్రూప్ ఓటింగ్ బాగానే పడే అవకాశం కనిపిస్తోంది. ఇక అజయ్ కి అఖిల్, స్రవంతిలు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. మరి చూద్దాం నాలుగోవారం కెప్టెన్ ఎవరు అవుతారు అనేది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus