ప్రముఖ తెలుగు నటి పై ముంబైలో ఉండే ఓ ఫిట్ నెస్ ట్రైనర్ అత్యాచారానికి పాల్పడడం అందరిని షాక్ కి గురి చేసింది.ఆ నటి ఎవరు అన్న విషయాలు బయటకు రాలేదు.. అలాగే ఈ ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇక అత్యాచారానికి గురైన వ్యక్తి పై నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.ఈ విషయం పై మరిన్ని వివరాల్లోకి వెళితే.. కూఫీ పరేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిత్య కపూర్ అనే ఫిట్ నెస్ ట్రైనర్ ఉన్నాడు.
అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ తెలుగు నటి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.తనకు కావాల్సింది దక్కిన తర్వాత.. పెళ్లి ఊసే ఎత్తడం లేదు అని, పెళ్లి చేసుకోవాలని కోరితే తనని తిట్టడమే కాకుండా తనపై చెయ్యి చేసుకుంటున్నాడని బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాదు ఇంకోసారి పెళ్లి టాపిక్ మాట్లాడితే.. వారు ఫిజికల్ గా ఒకటిగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను బయటపెడతానని బెదిరిస్తున్నాడట. అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడనని బెదిరించినట్టు ఆమె కంప్లైంట్లో పేర్కొంది.
సినిమాల్లో బిజీ కావాలని ప్రయత్నించే ప్రతీఒక్కరూ ఫిట్ నెస్ పై స్పెషల్ ఫోకస్ పెడుతుంటారు. ముఖ్యంగా నటీమణులు అవకాశాల కోసం ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పెద్ద పెద్ద హీరోయిన్లు మాత్రమే కాకుండా సీనియర్ నటీమణులు కూడా ఫిట్ నెస్ పై ఫోకస్ పెడుతుంటారు. అదే కొంతమంది కామాంధులైన ఫిట్ నెస్ ట్రైనర్ లకు అవకాశంగా మారుతుంది.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!