జనసేన అధినేత, అభిమానులు భక్తిగా పవర్ స్టార్ అంటూ పిలుచుకునే పవన్ కళ్యాణ్… సినిమాల్లోనే కాకుండా ..నిజ జీవితంలోనూ హీరో అనిపించుకుంటున్నారు..! జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఆయన చేస్తున్న కృషి వర్ణనాతీతం అనే చెప్పాలి. అధికార పార్టీ పవన్ కళ్యాణ్ ను చిత్ర హింసలు పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేస్తుంది. ఆయన సినిమాలు వస్తే… టికెట్ రేట్లు తగ్గించేస్తుంది. సినీ పరిశ్రమ పై కక్ష కడుతుంది.
ఇక రాజకీయాల పరంగా అతనికి ఎవరైనా మద్దతు పలికితే వారిని కూడా టార్గెట్ చేసి ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆయన ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీకి సాయం చేసిన జనాల ఇళ్లను రోడ్డు విస్తీర్ణం పేరు చెప్పి కూల్చడానికి రెడీ అయ్యింది. అదంతా ఒకవైపు అనుకుంటే.. ఇటీవల పవన్ కళ్యాణ్ పై కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఇప్పటం గ్రామానికి పరామర్శ కోసం వెళ్ళిన పవన్ కళ్యాణ్… కారు పై ఎక్కి వెళ్ళడం..
ఆ కారు వేగంగా వెళ్ళడంతో ఓ కుర్రాడికి యాక్సిడెంట్ అయ్యిందట. ఆ కుర్రాడి పేరు శివ. ఇతను తెనాలి కి చెందిన వ్యక్తి. తాను బైక్ యాక్సిడెంట్ కు గురవ్వడానికి పవన్ కళ్యాణ్ కారణమంటూ ఇతను తాడేపల్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.దీంతో పవన్ కళ్యాణ్ పై IPC 336, రెడ్ విత్ 177MV చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇదంతా పబ్లిసిటీ కోసం ఆ కుర్రాడు చేశాడు అని కొందరు అంటుంటే మరికొంత మంది మాత్రం పవన్ కళ్యాణ్ ఇమేజ్ డామేజ్ చేయడం కోసం వైసీపీ బ్యాచ్ ఇలా కేసుపెట్టించారు అంటూ మరికొంతమంది అంటున్నారు.