రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన విరాటపర్వం సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ గా రివ్యూలు వచ్చాయి. అయితే టాక్ కు తగినట్టుగా ఈ సినిమాకు బుకింగ్స్ లేకపోవడం గమనార్హం. ఈతరం యువతకు నక్సలిజం గురించి అవగాహన లేకపోవడం ఈ సినిమాకు ఒకింత మైనస్ అయిందని చెప్పవచ్చు. అయితే విరాటపర్వం సినిమాను బ్యాన్ చేయాలంటూ తాజాగా ఈ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు అందింది.
విశ్వ హిందూ పరిషత్ విద్యానగర్ జిల్లా కార్యదర్శి అజయ్ రాజ్ విరాటపర్వం మూవీ గురించి సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఈ సినిమా ఉందని మూవీలోని కొన్ని సీన్లు పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సినిమాలో చాలా సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. ఈ సినిమా ప్రదర్శనను ఆపివేయాలని కె.అజయ్ రాజ్ కోరారని సమాచారం. ఈ ఫిర్యాదు గురించి చిత్రయూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
సెన్సార్ బోర్డ్ అధికారి శిఫాలి కుమార్ పై కూడా ఫిర్యాదు నమోదైందని విరాటపర్వం సినిమాకు ఏ విధంగా అనుమతులు ఇచ్చారని ఫిర్యాదు అందిందని సమాచారం. విరాటపర్వం మూవీ నక్సలిజంను ప్రేరేపించేలా ఉందని ఇలాంటి సినిమాలకు సెన్సార్ బోర్డ్ ఏ విధంగా అనుమతులు ఇచ్చిందని ఫిర్యాదుదారుడు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. పోలీసులు ఈ ఫిర్యాదు విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
సాయిపల్లవి కొన్నిరోజుల క్రితం చేసిన కామెంట్ల వల్ల ఈ సినిమాకు కొంతమేర నష్టం జరిగిందనే సంగతి తెలిసిందే. ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఆలస్యంగానే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం అందుతోంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!