Ananta Sriram: ‘దిగు దిగు నాగ..’ రైటర్‌పై కేసు నమోదు!

రీసెంట్‌ టైమ్స్‌లో యూట్యూబ్‌లో మారుమోగుతున్న పాట ‘దిగు దిగు దిగు నాగ…’. నాగశౌర్య ‘వరుడు కావలెను’ సినిమాలోని ఈ పాటను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. మాంచి ఊపున్న పాట, రీతూ వర్మ స్టెప్పులతో పాట అదిరిపోయింది. దీంతో నెటిజన్లు తెగ చూస్తున్నారు. అయితే ఆ పాట విషయంలో రచయిత అనంత శ్రీరామ్‌పై కేసు నమోదైంది. ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా పాట ఉందంటూ ఓ పార్టీ నాయకురాలు కేసు వేశారు.

‘దిగు దిగు దిగు నాగ…’ అనేది కొత్త పాట కూడా కాదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్‌ అయిన జానపద గేయం అది. అందులో చిన్నపాటి మార్పులు చేసి రచయిత అనంత శ్రీరామ్‌ ఆ పాటను రాసుకొచ్చారు. అయితే అందులో ఓ వర్గ మనోభావాల్సి ఇబ్బంది పెట్టేలా పదాలు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ నాయకురాలు బిందు రెడ్డి నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పాటను హిందువులు ఎంతో భక్తిప్రవత్తులతో నాగదేవతను కొలుస్తూ పాడుతుంటారని,

అలాంటి భక్తి పాటను అలా మార్చడం ఏ మాత్రం సరికాదని బిందు రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి దీనిపై చిత్రబృందం, అనంత శ్రీరామ్‌ ఎలా స్పందిస్తారో చూడాలి. అన్నట్లు ఈ పాట యూట్యూబ్‌లో ఇప్పటికే 55 లక్షలకుపైగా వ్యూస్‌ సాధించింది.


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus