Catherine Tresa: ఇప్పటికైనా కేథరిన్ కి అవకాశాలు వస్తాయా..?

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేథరిన్ త్రెసా ఆ తరువాత ‘మద్రాస్’, ‘సరైనోడు’, ‘రుద్రమదేవి’ వంటి సినిమాలతో టాప్ రేసులో దూసుకుపోయింది. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా కూడా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. కానీ కొనేళ్లుగా కేథరిన్ జోరు బాగా తగ్గింది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ఫ్లాప్ కావడంతో కేథరిన్ డీలా పడింది.

అప్పటినుండి సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరసన ‘బింబిసార’తో పాటు ‘భళా తందనాన’ అనే మరో సినిమాలో నటిస్తోంది. కానీ సరైన సినిమాల్లో మాత్రం అవకాశాలు రావడం లేదు. అందుకే ఇప్పుడు అందరి హీరోయిన్ల మాదిరి కేథరిన్ కూడా ఇన్స్టాగ్రామ్ ను నమ్ముకుంది. మన తారలు అవకాశాలు తగ్గిన ప్రతీసారి హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దర్శకనిర్మాతలకు గాలం వేస్తుంటారు.

ఇప్పుడు కేథరిన్ కూడా అలానే ఇన్స్టాగ్రామ్ లో అందాల కనువిందు చేస్తోంది. హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో అకౌంట్స్ లో షేర్ చేస్తుంది. ఈ గ్లామర్ షోతోనైనా పెద్ద సినిమా అవకాశాలు వస్తాయని ఆశపడుతోంది. మరి ఆమె అనుకున్నట్లుగానే దర్శకనిర్మాతలు అవకాశాలు ఇస్తారేమో చూడాలి!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus