Krishna: సూపర్ స్టార్ కృష్ణ మొదటి వర్ధంతి వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

సూపర్ స్టార్ కృష్ణ గతేడాది నవంబర్ 15 న గుండెపోటు రావడంతో మరణించిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలో ఉన్న కాంటినెంటల్ హాస్పిటల్ లో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. 8 మంది డాక్టర్లు కృష్ణ గారికి ట్రీట్మెంట్ ఇచ్చినా ఆయన ప్రాణాన్ని కాపాడలేకపోయారు. కిడ్నీ వంటి అవయవాలు డ్యామేజ్ అవ్వడం, వయోభారంతో కృష్ణ గారు మరణించారు. ఇక ఆయన మరణించి నేటితో ఏడాది పూర్తయింది. దీంతో మామగారిని తలుచుకుని మహేష్ సతీమణి నమ్రత ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

‘వుయ్ మిస్ యు మామయ్య గారు, మా ఆలోచనల్లో, ప్రార్థనల్లో ఇంకా మీరు బ్రతికే ఉన్నారు. స్వర్గంలో కూడా మీరు ప్రేమ కలిగి, ప్రశాంతతో గడుపుతున్నారని భావిస్తున్నాను. మీ ప్రేమను, కీర్తిని మాకు ఇచ్చినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చింది. మరోపక్క మహేష్ బాబు కూడా.. ‘సూపర్ స్టార్ ఎప్పటికీ సూపర్ స్టారే..’ అన్నట్టు ఒక ట్వీట్ పెట్టాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రథమ వర్ధంతి కావడంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి..

ఆ వేడుకని ఘనంగా నిర్వహించి, నివాళులు అర్పించారు. ఈ వేడుకలో (Krishna) సూపర్ స్టార్ కృష్ణ గారి చిన్నబ్బాయి.. అలాగే ఆయన కూతుర్లు, అల్లుళ్ళు, మనవళ్లు, మనవరాళ్లు కూడా పాల్గొని.. ఆయనకు నివాళులు అర్పించారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ‘#SSKLivesOn ‘ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది. ఇక ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus