రమ్యకృష్ణ బర్త్ డే జోష్: వీకెండ్ పార్టీలతో సమంత, త్రిష రచ్చ!

సినిమా హీరోలు రెగ్యులర్ గా కలుసుకుంటారు లేదో తెలియదు గాని కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఖాళీ సమయాల్లో వీకెండ్ వచ్చిన ప్రతిసారి కలుసుకుంటారు. కొంత గ్యాప్ వచ్చినా కూడా పార్టీలతో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏమాత్రం విభేదాలు చూపకుండా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. త్రిష తన సోషల్ మీడియాలో కొంత మంది స్టార్స్ తో గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు త్రిష వీకెండ్ వస్తే ఎక్కువగా తన సన్నిహితులతో స్నేహితులతో పార్టీలో చేసుకుంటుంది.

ఇక రీసెంట్ గా కీర్తి సురేష్ కళ్యాణి ప్రియదర్శన్ సమంత వంటి వారితో పార్టీని చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇటీవల తిరుపతి నుంచి చెన్నై కి వెళ్లిన సమంత అక్కడ త్రిష ఇంట్లోనే ప్రత్యేకంగా పార్టీలు చేసుకున్నట్లు తెలుస్తోంది. త్రిష షేర్ చేసుకున్న ఫోటోలను సమంత కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేసుకుంది. అలాగే త్రిష గ్యాంగ్ రమ్యకృష్ణ కు సంబంధించిన బర్త్ డే వేడుకల్లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.

ఆ వేడుకకు యువ హీరోయిన్స్ తో పాటు రాధిక వంటి కొంతమంది సీనియర్ తారలు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం వీరి పార్టీలకు సంబంధించిన ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా హీరోయిన్స్ కూడా రెగ్యులర్ గా కలుసుకుంటారు వారి మధ్య పెద్దగా విబేధాలు ఉండవని కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా త్రిష అయితే తన స్నేహితులను మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారితో కూడా ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకుంటున్నట్లు మరోసారి క్లారిటీ వచ్చేసింది.

1

2

3

4

5

6

7

8

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus