Pushpa Movie: ‘పుష్ప’ కి బాలీవుడ్ కష్టాలు.. ఇలా అయితే కష్టమే..!

అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప‌’ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ డిసెంబర్ 17న విడుద‌ల కాబోతుంది. అయితే ప్రమోషన్స్ విషయంలో మాత్రం చేద్దామా వద్దా అన్నట్టు మొదలు పెట్టింది టీం. ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు ఈ చిత్రం రిలీజ్ అవుతుందన్న క్లారిటీ రాలేదు. చాలా చోట్ల ‘పుష్ప’ ని సరైన విధంగా ప్రమోట్ చేయడం లేదనే కంప్లైంట్ ఉంది.స్వయంగా రాజమౌళినే.. ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చెయ్యాలి..

మరీ ముఖ్యంగా ముంబైలో..’ అంటూ చెప్పకనే చెప్పాడు. ఇదే పెద్ద సమస్య అనుకుంటే.. ఇప్పుడు ‘పుష్ప’ మరో సమస్య వచ్చింది. అయితే తెలుగులో కాదు లెండి. హిందీ పుష్పకి పెద్ద సమస్య వచ్చి పడింది. ‘పుష్ప’ హిందీ వెర్షన్సె కు సెన్సార్ ఆగిపోయింది. పూర్తి సినిమా ఇస్తే గానీ, ఈ సినిమాని సెన్సార్ చేయ‌లేమ‌ని సెన్సార్ బోర్డు చిత్ర బృందానికి చెప్పిందట. మరో విడ్డూరం ఏంటంటే… మరో రెండు రోజుల్లో సినిమా ఉండి కూడా ‘పుష్ప’ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఇంకా పూర్తికాలేదు.

ప్రీ రిలీజ్ కు ఎగ్గొట్టి కూడా సుకుమార్ ముంబైలోనే గడిపాడు. అప్పటి నుండీ ముక్క‌లు ముక్క‌లుగా సెన్సార్ బోర్డుకి ‘పుష్ప’ ని పంపాడట. సెన్సార్ వారు ఎక్స్క్యూజ్ చేసి చూసినప్పటికీ ఆర్‌.ఆర్ సింక్ అవ్వడం లేదని తెలుస్తుంది. అందుకే ఈ విషయం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ‘పుష్ప’ టీం ప్రపోజల్ ను తిప్పి కొట్టింది. ఫుల్ లెంగ్త్ మూవీ కాపీతో వస్తేనే సెన్సార్ చేస్తామ‌ని తెగేసి చెప్పింది బాలీవుడ్ సెన్సార్ బోర్డు. దీంతో టీం కిందా మీదా పడుతుంది.

రేపు మధ్యాహ్నంకి అక్కడ సెన్సార్ అవ్వకపోతే చాలా కష్టమైపోతుంది.పైగా క్యూబ్స్‌కి కూడా ఎక్కించాలి.ఇలా చాలా తతంగం ఉంది. ఇలాగైతే పుష్ప హిందీ వెర్ఱ‌న్ విడుదలవ్వడం కష్టమే. అయితే ఒకరోజు లేట్ అయినప్పటికీ ‘పుష్ప’ ని హిందీలో రిలీజ్ చేయాలని సుకుమార్ భావిస్తున్నాడు. మరోపక్క నిర్మాతల అక్కడ తెలుగు వెర్షన్ ను ఎక్కువ స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారు. చివరికి ఏమవుతుందో చూడాలి..!

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus