Ravi Babu: ఊహించని సమస్యల్లో చిక్కుకున్న రవిబాబు మూవీ?

అల్లరి సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన రవిబాబు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించడంతో పాటు దర్శకునిగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రవిబాబు క్రష్ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అడల్ట్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రవిబాబు యూత్ కు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు. వేర్వేరు జోనర్లలో సినిమాలు తీస్తున్న రవిబాబు క్రష్ సినిమాతో మరో సక్సెస్ సాధిస్తానని భావిస్తున్నారు. అయితే క్రష్ సినిమాకు సెన్సార్ కష్టాలు ఎదురయ్యాయని తెలుస్తోంది.

సినిమా చూసిన సెన్సార్ సభ్యులు 9 కట్స్ చెప్పారని సమాచారం. సెన్సార్ సభ్యులు చెప్పిన కట్స్ కథతో లింక్ ఉన్న అంశాలు కావడంతో రవిబాబు కట్స్ విషయంలో ఏం చేయాలా..? అని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. రవిబాబు రివైజింగ్ కమిటికి క్రష్ సినిమాను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. రవిబాబు సెన్సార్ సభ్యులు చెప్పిన కట్స్ విషయంలో ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన క్రష్ టీజర్ ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

రవిబాబు గత సినిమాలు లడ్డు బాబు, అదుగో, ఆవిరి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. అయితే రవిబాబు దర్శకుడిగా కొత్తదనం ఉన్న కథలను ఎంచుకున్నాడని ప్రశంసలు మాత్రం దక్కాయి. రవిబాబు సినిమాలను అభిమానించే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. దర్శకుడిగా ఎన్నో విజయాలు ఉన్నా రవిబాబు స్టార్ హీరోలతో కాకుండా కొత్త హీరోలతో, కొత్త హీరోయిన్లతో ఎక్కువగా సినిమాలను తెరకెక్కించడం గమనార్హం.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus