తమిళనాడు ప్రభుత్వం థియేటర్లలో 100% ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇవ్వడం పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళనాడులో పర్మిషన్ ఇచ్చేసరికి తెలుగు నిర్మాతల మండలి కూడా మాకు ఇవ్వండి అని వినతిపత్రం అందించింది. కట్ చేస్తే.. తమిళనాడు గవర్నమెంట్ పాస్ చేసిన 100% ఆక్యుపెన్సీని క్యాన్సిల్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. ఈ మేరకు హోమ్ సెక్రటేరియట్ నుంచి తమిళనాడు ముఖ్యమంత్రికి ఇవాళ ఒక లేఖ వచ్చింది. అందులో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 100% ఆక్యుపెన్సీ పర్మిషన్ ను రీకన్సిడర్ చేయాలనీ, కుదిరితే క్యాన్సిల్ చేయాలనీ సున్నితంగా మొట్టికాయ వేసింది సెంట్రల్ గవర్నమెంట్.
అయితే.. స్వయంగా విజయ్ వెళ్లి అడిగి మరీ తెచ్చుకున్న 100% ఆక్యుపెన్సీకి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ అడ్డు చెప్పడం అనేది సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదివరకు జయలలిత ప్రభుత్వం ఉన్నప్పుడు విజయ్ అన్ని సినిమాల రిలీజ్ సమయంలో ఎదో ఒక అడ్డంకి చెప్పి రచ్చ చేసేది. గత చిత్రం విజిల్ ఒక్కటే ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విడుదలైంది. ఇప్పుడు మాస్టర్ కూడా ఎలాంటి ప్రోబ్లం లేకుండా రిలీజ్ అవ్వుద్ది అనుకుంటే..
విజయ్ నెత్తిన పిడుగు వేసింది సెంట్రల్ ప్రభుత్వం. మరి విజయ్ & కో ఈ విషయమై ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి సేఫ్.