వాళ్ల కారణంగా సినిమా ఛాన్సులు కోల్పోయా!

Advertisement

‘జబర్దస్త్’ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న చలాకీ చంటి తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. తన ప్రమేయం లేకుండానే చుక్కల్లో పడి చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయినట్లు వెల్లడించారు. రీసెంట్ గా ఓ టీవీ షోలో పాల్గొన్న చంటి తన కెరీర్, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో తన జీవితంలో పదహారు సినిమాలు కోల్పోయినట్లు.. ప్రభాస్ ఫ్యాన్స్ చుక్కలు చూపించినట్లు చెప్పారు. 2014లో కొన్ని వందల మంది ప్రభాస్ ఫ్యాన్స్ తనపై ఎటాక్ చేశారని చెప్పాడు చంటి.

తాను ప్రభాస్ ని ఏదో అన్నానని.. ఎవరో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో ఎలాంటి ఆధారాలు చెక్ చేసుకోకుండానే ప్రభాస్ ఫ్యాన్స్ తనను టార్గెట్ చేశారట. ఓ వారం రోజుల పాటు ఫోన్లు, మెసేజ్ లు, సోషల్ మీడియాలో పోస్ట్ లతో చుక్కలు చూపించారని చెప్పాడు. దీంతో ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పినట్లు తెలిపారు చంటి. అయితే ఈ సంఘటన తన కెరీర్ పై పరోక్షంగా దెబ్బ కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ రూమర్ల కారణంగా సినిమా అవకాశాలు పోయాయని.. అలానే వాళ్ల టార్చర్ భరించలేక ఫోన్ నెంబర్ మార్చడంతో చాలా మంచి అవకాశాలు పోగొట్టుకున్నానని చెప్పారు. కొందరు దర్శకులు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో ఆ పాత్రలకు వేరే వాళ్లను తీసుకున్నారని.. అలా దాదాపు 16 సినిమాల వరకు మిస్ అయినట్లు చెబుతూ బాధపడ్డాడు.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus