బిగ్ బాస్ కార్యక్రమం తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షోగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇలా తెలుగులో ఇప్పటికే ఆ ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఆరవ సీజన్ ప్రసారమవుతుంది. ఇక ఈ కార్యక్రమం 21 మంది కంటెస్టెంట్లతో ఎంతో ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంతోమంది కంటెస్టెంట్లు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇండస్ట్రీలో బిజీగా ఉండగా మరి కొందరు మాత్రం నెగిటివిటీ మూట కట్టుకొని ఉన్న అవకాశాలను కూడా కోల్పోయిన వారు ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలామంది వెనుకడుగు వేస్తారు.అయితే జబర్దస్త్ కార్యక్రమంలో సీనియర్ కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న చలాకి చంటి ఎప్పటినుంచో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనాలనే ఆశ ఉండేదట తనకు ఈసారి అవకాశం రావడంతో ఇదే విషయాన్ని వెళ్లి మల్లెమాలవారికి చెప్పగా మల్లెమాలవారు తనని బిగ్ బాస్ కార్యక్రమానికి పంపించడానికి ఏమాత్రం ఇష్టపడలేదని వెల్లడించారు. నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చిందంటే మల్లెమాలవారు అనవసరంగా వెళ్లడం ఎందుకు ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పారు.
అయితే తనకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయని ప్రస్తుతం తనకు డబ్బు అవసరం ఉంది నేను వెళ్లాలని చెప్పగా మల్లెమాలవారు మనం ఇంకో షో ఏదైనా ప్లాన్ చేద్దాం అని తనని ఆపే ప్రయత్నం చేశారంటూ చంటి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ఆ మాటలు విన్న తను నేను బిగ్ బాస్ నుంచి వెళ్లి వచ్చిన తర్వాత కొత్త షో ప్లాన్ చేద్దాం అంటూ సమాధానం చెప్పానని ఈయన వెల్లడించారు. సాధారణంగా జబర్దస్త్ కార్యక్రమం నుంచి ఒక కంటెస్టెంట్ బయటికి వచ్చిన తర్వాత తిరిగి జబర్దస్త్ కార్యక్రమంలోకి తీసుకోరు.
కానీ నేను బిగ్ బాస్ పూర్తయిన తర్వాత తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి వస్తానని చెప్పడంతో మల్లెమాలవారు అందుకు ఓకే చెప్పారని ఈ సందర్భంగా చలాకి చంటి ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.గతంలో కూడా ఈయన పలు సినిమా షూటింగుల నిమిత్తం వ్యక్తిగత కారణాలవల్ల రెండు మూడు సార్లు జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్లి తిరిగి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలియజేశారు.