మరో సంచలనానికి తెరలేపిన చలపతిరావు!!

  • July 19, 2017 / 05:35 AM IST

టాలీవుడ్ లో సీనియర్ నటుడు చలపతి రావు నోటికి హద్దు లేకుండా పోయింది అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి…ఎప్పటికప్పుడు తన నోటి దురుసుతో ఏదో ఒక వివాదాన్ని తెరపైకి తెచ్చి మీడియా దృష్టిలో పడే మన చలపాయ్…ఆ మద్య ఆడవాళ్ళ గురించి కాస్త వ్యంగ్యంగా మాట్లాడి ఇబ్బందులు పడ్డాడు…మళ్లీ మీడియా సాక్షిగా క్షమాపణలు సైతం చెప్పాల్సినంత పని అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఒక మీడియా కి ఇచ్చిన ఇంటెర్వ్యు లో మరోసారి నోరు పారేసుకున్నాడు… అన్న నందమూరి తారక రామునికి నమ్మిన బంటు అయిన చలపాయ్ మీడియాతో మాట్లాడుతూ…పెద్ద ఎన్టీఆర్ వారసులు ఎవరు ? అనే ప్రశ్నకు బదులుగా కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేసాడు. అసలు మీడియా అడిగింది ఏంటి? మన చలపాయ్ చెప్పింది ఏంటి అంటే…మన సినిమా రంగంలో…పెద్ద ఎన్టీఆర్ నటనకు వారసులు ఎవరు అని మీడియా అడగగా…కాస్త కూడా ఆలోచించకుండా….బాలకృష్ణ, జూ ఎన్టీఆర్‌లలో ఎవరూ ఎన్టీఆర్‌ నటనకు వారసులుకారు ఆయన నటన ఆయనతోనే ఎండ్ అంటూ చలపతి రావు కామెంట్స్ చేసాడు. అంతేకాకుండా సీనియర్ ఎన్టీఆర్‌ నటనా సామర్ధ్యానికి పది కిలోమీటర్ల వరకు ఎవరూ రాలేరు వచ్చే అవకాశమే లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

ఇక ఎన్టీఆర్ గురించి మరింత ప్రస్తావిస్తూ…ఎన్టీర్ ఆధ్యాత్మికిత వేరు ఆయన క్రియేషన్ వేరు. నటుడిగా, దర్శకుడిగా, స్క్రిప్టు రైటర్‌గా, మానవత్వం గల మనిషిగా ఆయన లెవల్ కి సరితూగగల నటుడు ఎవరు ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో లేరు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. అంతటితో ఆగాడా అంటే…లేదు…మీడియా వాళ్ళు అడిగిన మరో ప్రశ్న ప్రస్తుతం ప్రభుత్వాలు ఇస్తున్న అవార్డుల విషయమై స్పందిస్తూ ఈ అవార్డులు చెత్త అవార్డులుగా మారిపోయాయి అంటూ మరో వివాదానికి తెరతీసాడు చలపతి రావు. మొత్తంగా చూసుకుంటే చలపాయ్ మాటాల్లో అనేక కోణాలు వేతుకుతున్నప్పటికీ ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు అంటున్నారు నందమూరి అభిమానులు…ఎందుకంటే ఎన్టీఆర్ తో సారి పోల్చగల నటుడు కానీ…ఆయనతో సారి తూగగల వ్యక్తిత్వం ఉన్న మనిషి కానీ ఎవ్వరూ లేరు అన్నది ఒప్పుకుని తీరాల్సిన నిజం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus