ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీయడంలో సీనియర్ స్టార్ దర్శకులు కృష్ణవంశీ స్టైలే వేరు. ఆయన ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అంటే థియేటర్ల వద్ద పండగ వాతావరణం ఏర్పడేది. ‘నిన్నే పెళ్ళాడతా’ అనే సినిమా వచ్చిన టైంలో ‘ఫ్యామిలీస్ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది’ అంటూ ఆడియన్స్ ఒక ఆనందంతో థియేటర్ నుండి బయటకు వచ్చారు.
తర్వాత మహేష్ బాబుతో చేసిన ‘మురారి’ కూడా అంతే. అయితే ‘ఖడ్గం’ తర్వాత కృష్ణవంశీ తీసిన సినిమాలు అన్నీ నిరాశపరిచాయి. ‘రాఖీ’ పర్వాలేదు అనిపించినా.. క్లీన్ హిట్ అయితే కాదు. అలాంటి టైంలో నవదీప్, శివ బాలాజీ..లను హీరోలుగా పెట్టి ‘చందమామ’ చేశాడు కృష్ణవంశీ. కాజల్, సింధు మీనన్ హీరోయిన్లుగా నటించారు. సి.కళ్యాణ్ మరియు ఎస్.విజయానంద్ లు నిర్మించిన ఈ చిత్రం 2007వ సంవత్సరం సెప్టెంబర్ 6న పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది. మౌత్ టాక్ తోనే సూపర్ హిట్ అయ్యింది. కె.ఎం.రాధాకృష్ణన్ అందించిన సంగీతం, ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలెట్ అని చెప్పాలి. ‘యమదొంగ’ వంటి పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ ‘చందమామ’ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఈ సెప్టెంబర్ 6 కి ‘చందమామ’ రిలీజ్ అయ్యి 18 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 2.58 cr |
సీడెడ్ | 1.19 cr |
ఉత్తరాంధ్ర | 1.21 cr |
ఈస్ట్ | 0.39 cr |
వెస్ట్ | 0.36 cr |
గుంటూరు | 0.75 cr |
కృష్ణా | 0.64 cr |
నెల్లూరు | 0.36 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 7.48 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.87 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 9.35 cr |
‘చందమామ’ చిత్రం రూ.4.85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా రూ.9.35 కోట్ల షేర్ ను ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. మొత్తంగా రూ.4.5 కోట్ల లాభాలు అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘చందమామ’