‘కార్తికేయ’ తో (Karthikeya) దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన చందూ మొండేటి (Chandoo Mondeti).. ఆ తర్వాత ‘ప్రేమమ్’ (Premam) ‘కార్తికేయ 2’ (Karthikeya 2) వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ చేశాడు. ‘కార్తికేయ 2’ తో నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇటీవల వచ్చిన ‘తండేల్’ (Thandel) కూడా మంచి విజయాన్ని అందుకుంది. నాగ చైతన్య(Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ‘గీతా ఆర్ట్స్’ సంస్థ పై బన్నీ వాస్ (Bunny Vasu) ఈ చిత్రాన్ని నిర్మించారు.
అల్లు అరవింద్ (Allu Aravind) సహా నిర్మాతగా వ్యవహరించారు. ఇదిలా ఉండగా.. ‘కార్తికేయ 2’ తర్వాత చందూ మొండేటికి చాలా ప్రొడక్షన్ హౌస్..ల నుండి పే-చెక్స్ వెళ్లాయి. కానీ అతను మాత్రం ‘గీతా ఆర్ట్స్’ కి ఇచ్చిన కమిట్మెంట్ కి కట్టుబడి ఉన్నాడు. అది అల్లు అరవింద్ ను బాగా ఇంప్రెస్ అయ్యేలా చేసింది. దాదాపు 2 ఏళ్ళ పాటు ‘తండేల్’ కోసమే తన ప్రైమ్ టైం కేటాయించాడు చందూ మొండేటి. ఇక ఇప్పుడు ‘తండేల్’ సినిమా కంప్లీట్ అయ్యింది.
దాని బాక్సాఫీస్ ఫలితం కూడా బాగానే ఉంది. కానీ ఇప్పుడు చందూ మొండేటికి ఆఫర్లు రావడం లేదు అని వినికిడి. ‘కార్తికేయ 2’ తర్వాత చందూ మొండేటిని అప్రోచ్ అయిన ప్రొడ్యూసర్స్.. ‘తండేల్’ రిలీజ్ తర్వాత అప్రోచ్ అవ్వడం లేదట. ఒక్క ‘పీపుల్ మీడియా’ విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) మాత్రం ‘కార్తికేయ 3’ కోసం సంప్రదిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. మరోపక్క హీరోలు కూడా ఖాళీగా లేరు. ఒకవేళ ‘కార్తికేయ 3’ చేయాలని చందూ అనుకున్నా..
నిఖిల్ అయితే ఇప్పుడు ఖాళీగా లేడు. ‘స్వయంభు’ (Swayambhu) అనే పాన్ ఇండియా సినిమా చేస్తూ అతను బిజీగా ఉన్నాడు. అది కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి ఇంకో 7 నెలలు టైం పట్టొచ్చు. తర్వాత ‘కార్తికేయ 3’ సెట్స్ పైకి వెళ్లే సరికి ఇంకో 6 నెలలు టైం పట్టొచ్చు. సో ఏడాది పాటు దర్శకుడు చందూ మొండేటి ఖాళీగా ఉండాల్సిందేనేమో.