Akhanda Movie: అఖండ మూవీపై చంద్రబాబు షాకింగ్ రివ్యూ!

తెలుగు రాష్ట్రాలలో అఖండ మూవీ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారీస్థాయిలో కలెక్షన్లు సాధించిన సినిమాగా అఖండ సినిమా నిలిచింది. అఖండ సినిమా గురించి సెలబ్రిటీలు పాజిటివ్ గా స్పందించి సోషల్ మీడియాలో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. వచ్చే గురువారం వరకు బాక్సాఫీస్ వద్ద అఖండ సినిమా దూకుడు కొనసాగే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.

అఖండ సినిమా రిలీజైన సమయంలో ఈ సినిమాలో బాలయ్య చెప్పిన కొన్ని డైలాగ్స్ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చెప్పిన డైలాగ్స్ అనే కామెంట్లు వినిపించాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం ఆ కామెంట్ల గురించి స్పందించడానికి అస్సలు ఇష్టపడలేదు. “గొర్రెలు కసాయి వాణ్నే నమ్మి ఓట్లేస్తాయి”, “నువ్వేమైనా పోలవరం డ్యామా.. పట్టిసీమ తూమా”, “పంచభూతాలతో పెట్టుకున్నవాడు ఎవడూ బాగుపడలేదు.. తునాతునకలై ముక్కలు కూడా దొరకలేదు” డైలాగ్స్ ఏపీ అధికార పార్టీని ఉద్దేశించి పేల్చిన డైలాగ్స్ అని కొంతమంది భావించారు.

గుళ్లో విగ్రహాల గురించి బాలయ్య పేల్చిన డైలాగ్ సైతం ఏపీ అధికార పార్టీకి సంబంధించిన డైలాగ్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇన్ డైరెక్టుగానే డైలాగ్స్ ఉండటంతో వీటి గురించి ఎక్కువగా చర్చ జరగలేదు. తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అఖండ సినిమాలో చూపించారని చెప్పుకొచ్చారు. సినిమాలో చూసిన దృశ్యాలే ఏపీలో చోటు చేసుకుంటున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న దృశ్యాలను కళ్లకు కట్టినట్టు ఈ సినిమాలో చూపించారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. చిత్రయూనిట్ కు చంద్రబాబు అభినందనలు తెలపడంతో పాటు వైసీపీపై విమర్శలు చేశారు. చంద్రబాబు పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో నందమూరి అభిమానులు సంతోషిస్తున్నారు. ఏపీ పరిస్థితులనే అఖండలో చూపించారని చంద్రబాబు కామెంట్లు చేయడంతో ఆ డైలాగ్స్ అధికార పార్టీని ఉద్దేశించి రాసిన డైలాగ్స్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య తరువాత సినిమాలు తెరకెక్కనున్నాయి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus