Chandramukhi 2: ‘చంద్రముఖి 2’ ప్రీ-రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

2005 ఏప్రిల్ 14న వచ్చిన ‘చంద్రముఖి’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో చేసిన ఈ సినిమా ఊహించని కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో జ్యోతిక అతి ముఖ్యమైన పాత్రని పోషించగా.. కీలక పాత్రలో ప్రభు నటించారు. పి.వాసు ‘చంద్రముఖి’ పాత్రలో జ్యోతిక కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది అదే విధంగా చాలా భయపెట్టింది అని చెప్పాలి.

ఇక ఈ సినిమాకి రెండో భాగంగా ‘చంద్రముఖి 2 ‘ రూపొందిన సంగతి తెలిసిందే. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కంగనా రనౌత్ చంద్రముఖిగా కనిపించనుంది.పి.వాసునే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం జరిగింది. ‘లైకా ప్రొడక్షన్స్’ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో తిరుపతి ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులకు ఈ చిత్రం స్పెషల్ షో వేయడం జరిగింది.

వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉందట. లారెన్స్ పెర్ఫార్మన్స్, కొన్ని హర్రర్ మూమెంట్స్ థ్రిల్స్ చేసే విధంగా ఉంటాయట. ఇంటర్వెల్ లో చిన్నపాటి ట్విస్ట్ కూడా ఉందని.. అది కూడా బాగానే ఉందని అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉందట. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ విసిగించింది అని అంటున్నారు. చాలా చోట్ల ‘చంద్రముఖి’ ‘నాగవల్లి’ సినిమాలనే చూసిన ఫీలింగ్ కలుగుతుందట.

మొత్తంగా ఈ ‘చంద్రముఖి 2 ‘ (Chandramukhi 2) లో కొత్తదనం ఏమీ లేదని, ‘చంద్రముఖి’ పై ఉన్న క్రేజ్ జనాలను థియేటర్ కి రప్పించవచ్చేమో అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ పోర్షన్స్ అలాగే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రం మెప్పించే విధంగా ఉంటాయని సినిమా చూసిన వాళ్ళు అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుంది అనేది చూడాలి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus