కేరళలో అనుకున్నారు.. వైజాగ్ కు మారుతున్నారు..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా.. సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ అనే చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ చిత్రం షూటింగ్ మార్చిలోనే మొదలుపెట్టాలి అనుకున్నారు. కథలో భాగంగా దట్టమైన అడవి ప్రాంతం కావాలని కేరళలో చిత్రీకరణ ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల లాక్‌డౌన్ ఏర్పడడంతో ఈ చిత్రం షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం షూటింగ్లకు అనుమతులు ఇచ్చినప్పటికీ.. ఇంకా ‘పుష్ప’ షూటింగ్ మొదలుకాలేదు. దానికి ప్రధాన కారణం కేరళలో మళ్ళీ కరోనా విజృంభించడమే అని స్పష్టమవుతుంది.

ఈ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ షూటింగ్ ను వైజాగ్ కు మార్చినట్టు తెలుస్తుంది. నవంబర్ 5 నుండీ వైజాగ్‌లో ‘పుష్ప’ చిత్రం షూటింగ్ మొదలుకానుందట. చిత్రీకరణ మొత్తం ఏపీ, తెలంగాణలోనే పూర్తి చేసి 2021 సమ్మర్ కి సినిమాని రెడీ చెయ్యాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ గుబురు గడ్డం మరియు లాంగ్ హెయిర్ ను పెంచి కొత్త లుక్ లోకి మారాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus