Bigg Boss: బిగ్ బాస్ సీజన్ – 6 లో వచ్చేమార్పులేంటో మీకు తెలుసా..?

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఈసీజన్ నుండీ సరికొత్తగా ముస్తాబవ్వబోతోందా అంటే నిజమే అంటున్నారు నెటిజన్స్. అసలు మేటర్లోకి వెళితే, బిగ్ బాస్ సీజన్ 6 నుంచీ ఓటీటీలో కూడా రాబోతోందట. ఓటీటీలో కేవలం 54రోజులు మాత్రమే ఈ షో ఉంటుందని, ఇందులో పార్టిసిపేట్ చేసేందుకు ఆడిషన్స్ ఉంటాయని, ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే హిందీలో ఓటీటీలో స్టార్ట్ చేసిన ఈషోకి కరణ్ జోహార్ యాంకరింగ్ చేస్తున్నారు. హీందీలో మంచి సక్సెస్ కూడా అయ్యింది. అలాగే, అదేవిధంగా తెలుగులో కూడా ఇద్దరు యాంకర్స్ తో ఈషో ఉండబోతోందని అంటున్నారు.

ఇక్కడ మేల్ యాంకర్ గా హైపర్ ఆది ఉంటాడని, ఫిమేల్ యాంకరింగ్ శ్రీముఖి చేయబోతోందని టాక్ వినిపిస్తోంది. ప్రతివారం ఇద్దరు యాంకర్స్ షోలో సందడి చేస్తారట. ఈ జనవరి కొత్త సంవత్సరం నుండీ ఎంట్రీలు తీస్కుంటారని టాక్ వినిపిస్తోంది.

ఇక మరోవైపు టెలివిజన్ లో ఈషోని రన్ చేసేందుకు కూడా ఈ ఓటీటీ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఓటీటీలో పార్టిసిపేట్ చేసి గేమ్ బాగా ఆడిన సభ్యులని టెలివిజన్ షోకి ఎంపిక చేస్తారట. ఇందులో సత్తా చాటి టాప్ ఫైవ్ కి వెళితే టెలివిజన్ బిగ్ బాస్ రియాల్టీ షోలో నేరుగా పార్టిసిపేట్ చేసేలా ఓటీటీ షోని డిజైన్ చేయబోతున్నారు.

ఇక మరోవైపు టెలివిజన్ లో ఈషో రేటింగ్ పైన కూడా బిగ్ బాస్ టీమ్ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఫస్ట్ సీజన్స్ తో పోలిస్తే ఐదో సీజన్ లో రేటింగ్ బాగా తగ్గింది. అందుకే, ఈసారి వేరే యంగ్ హీరోని హోస్ట్ గా పెట్టాలని కూడా బిగ్ బాస్ టీమ్ ఆలోచనలో ఉన్నట్లుగా టాక్. ఏది ఏమైనా ఈసారి తెలుగులో ఈషో మరో లెవల్లో ఉండబోతోందని అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. అదీ మేటర్.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus